Pooja Hegde: పాపం బుట్టబొమ్మ.. ఐటెం సాంగ్స్ కు రెడీ అంటున్న పూజాహెగ్డే?
రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలు పూజాహెగ్డేకు వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి.
- By Balu J Published Date - 05:59 PM, Mon - 15 May 23
దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో దూసుకుపోయిన బుట్టబొమ్మ (Pooja Hegde) ప్రస్తుతం అవకాశాలు లేకుండాపోయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలు పూజాహెగ్డేకు వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. సక్సెస్ రేటు తగ్గడంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేసినప్పటికీ హిట్ దక్కలేదు.
ఆమెకు ఇప్పటికీ బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి, గత కొన్ని నెలలుగా ఆమె ఏ తెలుగు సినిమాలకు సైన్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆమె మహేశ్ బాబు #SSMB28లో నటిస్తున్నప్పటికీ తాత్కాలిక బ్రేక్ పడింది. ఇక పూజకు సినిమా షెడ్యూల్లు ఏవీ లేకపోవడంతో పూజా కమర్షియల్ యాడ్స్ చేస్తూ సెలవులను అస్వాదిస్తోంది. అయితే ఈ బ్యూటీ ఓ ఐటెం సాంగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. సమంత ‘ఊ అంటావా మావా ఊ’ మాదిరిగా తాను కూడా అలాంటి ఐటెం పాట (Item Song)లో అందాలు ఆరబోయాలని ఫిక్స్ అయ్యిందట. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ ఐటెం సాంగ్స్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
Also Read: Viral Video: వీడు మాములోడు కాదు, తల్లిపైనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు!
Related News
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. ఎందుకంటే
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్లు, ఫెయిల్యూర్స్ రుచి చూశారు. ఛత్రపతి ఫ్లాప్ కావడంతో ఆయన బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి. చిన్న విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కౌశిక్ దర్శకత్వంలో కిష్కిందపురి