HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Case Registered Against Ysrcp Leader Ambati Rambabu

Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు

రాజకీయ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి అవసరం. కానీ, అంబటి మరియు ఆయన అనుచరులు దీనిని లెక్కచేయకుండానే పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని పోలీసులు అభిప్రాయపడ్డారు.

  • Author : Latha Suma Date : 05-06-2025 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Case registered against YSRCP leader Ambati Rambabu
Case registered against YSRCP leader Ambati Rambabu

Ambati Rambabu :  పోలీసులను బెదిరించిన ఘటనలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. బుధవారం (జూన్ 4) గుంటూరులో జరిగిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో జరిగిన సంఘటన ఈ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ తరఫున నిర్వహించారు. అయితే, ర్యాలీ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరు సిద్ధార్థనగర్‌లోని తన నివాసం నుంచి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్‌ వైపు బయలుదేరారు. మధ్యలో పోలీసులు వారిని ఆపడంతో ర్యాలీ దారి మళ్లించి వివేకానంద విగ్రహం వద్ద నుంచి కంకరగుంట ఓవర్‌ బ్రిడ్జి దిశగా పోయారు. అక్కడ మరోసారి పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.

Read Also: IPS Transfers : తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

ఈ సందర్భంలో పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ర్యాలీకి ముందస్తుగా అనుమతి తీసుకోలేదని, ఓవర్‌ బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడం చట్టవిరుద్ధమని. కానీ, అంబటి రాంబాబు పోలీసుల ఆంక్షలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “ఎలా ఆపుతారో చూద్దాం” అంటూ కాస్త ఘాటుగా స్పందించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు శాంతంగా స్పందిస్తూ, “మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి” అని హెచ్చరించారు. అయితే, అంబటి రాంబాబు అసహనం వ్యక్తం చేస్తూ పళ్లు కొరుకుతూ, నాలుక మడతపెట్టి పోలీసులను బెదిరించేలా వ్యవహరించారు. సీఐ ఘాటుగా స్పందిస్తూ, “ఇక్కడ మీ బెదిరింపులకు భయపడే వారు లేరు” అని స్పష్టం చేశారు.

రాజకీయ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి అవసరం. కానీ, అంబటి మరియు ఆయన అనుచరులు దీనిని లెక్కచేయకుండానే పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో అంబటి రాంబాబు సహా మరికొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై IPC సెక్షన్ 353 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో అతనికి ఆటంకం కలిగించడం లేదా బెదిరించడం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వీడియో ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను సేకరిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, వైఎస్సార్సీపీ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకారం భాగంగా పరిగణిస్తూ, పోలీసులు అతి వేగంగా స్పందించారని ఆరోపిస్తున్నాయి.

Read Also: Stampede : అప్పుడు అల్లు అర్జున్ అరెస్టు.. ఇప్పుడు ఎవర్ని ? – నెటిజన్ల ప్రశ్నలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • Case registration
  • Pattabhipuram Police Station
  • Vennupotu dinam
  • ysrcp

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd