Divvela Madhuri : దివ్వెల మాధురికి షాక్ ఇచ్చిన పోలీసులు
Divvela Madhuri : ఆలయ నియమావళి ప్రకారం ఆలయం ప్రాంగణంలో ఎలాంటి ఫొటో షూట్స్ , రీల్స్ చేయకూడదు కానీ..మాధురి మాత్రం ఆలయ నియమాలను ధిక్కరించి ఫోటో షూట్ చేయడం తో ఆలయ అధికారులు పోలీసులకు పిర్యాదు చేసారు
- Author : Sudheer
Date : 21-10-2024 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (YCP MLC Duvwada Srinivas) సన్నిహితురాలు దివ్వెల మాధురి(Divvela Madhuri)కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల మాధురి తిరుమలకు వెళ్లినప్పుడు ఆమె ఫొటోషూట్లు, రీల్స్ చేశారన్న (Madhuri Photo Shoot At Tirumala) కారణంగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు ఫిర్యాదు చేశారు. ఆలయ నియమావళి ప్రకారం ఆలయం ప్రాంగణంలో ఎలాంటి ఫొటో షూట్స్ , రీల్స్ చేయకూడదు కానీ..మాధురి మాత్రం ఆలయ నియమాలను ధిక్కరించి ఫోటో షూట్ చేయడం తో ఆలయ అధికారులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు.
కొద్దిరోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాణి తన భర్త ఇంటి ముందు కదలకుండా.. కొన్ని రోజుల పాటు అలానే కూర్చుండిపోయింది. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధుతో లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, ఆయన భార్య వాపోయింది. అంతేకాకుండా.. తనను పట్టించుకొవట్లేదని, ఆస్తులన్ని ఆమెకు రాసిస్తున్నారని వాపోయింది. దీంతో ఇది ఏపీలో పెద్ద రచ్చగా మారింది. ఈ క్రమంలో వైసీపీ టెక్కలి నియోజక వర్గం బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించింది. అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం..తాను… దివ్వెల మాధురితో ఉంటానని తెల్చిచెప్పారు. వీరి కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ మధ్యనే వీరిద్దరూ తిరుమలలో హల్చల్ చేసారు. శ్రీవారి దర్శన అనంతరం మాడ వీధుల్లో ఫోటోలు,వీడియోలు తీసుకుంటూ రచ్చ చేశారు. వీరిద్దరు కలిసి ప్రీవెడ్డింగ్ షూట్ చేసినట్లు అప్పుడు అంత మాట్లాడుకున్నారు. తిరుమలలో ఫొటోషూట్ చేయడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలను దువ్వాడ, మాధురి దెబ్బతీశారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసారు.
Read Also : Waking Benefits: ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?