AP Politics: సినిమాలో పొలిటికల్ డైలాగ్స్.. పాలిటిక్స్ లో సినిమా డైలాగ్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య అనేక కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ కామెంట్స్ తో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 04:59 PM, Sun - 30 July 23

AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య అనేక కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ కామెంట్స్ తో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి, జగ్గూభాయ్ అంటూ సీఎం జగన్ ని విమర్శించారు. ఇక ఆయన వ్యాఖ్యల్లో బాగా కాంట్రవర్సీకి దారి తీసింది వాలంటీర్ వ్యవస్థపై ఆయన చేసిన విమర్శలు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటూ పవన్ పేల్చిన బాంబు దుమారం రేపింది. అదీకాక తనకు ఢిల్లీ నిఘా సంస్థలు చెప్పాయని పవన్ చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ నిఘా సంస్థలు పవన్ కళ్యాణ్ కి ఎందుకు సమాచారం ఇస్తుందంటూ ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఏపీలో మహిళలు మిస్సింగ్ అవుతున్న సమాచారాన్ని ప్రభుత్వానికి లేదా నిఘా సంస్థల అధికారులు విచారిస్తారు. కానీ అంత గోప్యంగా ఉండే సమాచారాన్ని పవన్ చేతికి ఇవ్వడాన్ని వాళ్ళు హైలెట్ చేస్తూ పవన్ ని విమర్శించారు. అధరాలు లేని ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో చులకన అవ్వడం తప్ప రాజకీయంగా ఎటువంటు ప్రయోజనం ఉండదంటున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో సినిమాలు డైలాగులు వాడుతారని, అలాగే సినిమాలో పాలిటిక్స్ డైలాగ్స్ చెప్తున్నారు విమర్శించారు. పవన్ కి ఓటెయ్యడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కుళ్లిపోయిన పార్టీగా ఆయన అభివర్ణించారు. కుళ్లిపోయిన పార్టీతో దోస్తీ కట్టడం ద్వారా ప్రయోజనం ఏంటని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని ఏపీ ప్రజలు పటించుకోవడం లేదని, అందుకే ఆయన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అసలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: Manipur: అక్రమ వలసదారులను గుర్తించడం కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న మణిపూర్ ప్రభుత్వం?