Amma Vodi: సీఎం జగన్‌పై చెక్ బౌన్స్ కేసు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకంలో లెక్కలు తేలడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బిటెక్ రవి.
- Author : Praveen Aluthuru
Date : 20-07-2023 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
Amma Vodi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకంలో లెక్కలు తేలడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బిటెక్ రవి. సీఎం జగన్ బటన్ నొక్కి చాలా రోజులైనా ఇంకా అమ్మఒడి పథకం డబ్బులు సగం మంది లబ్ధిదారుల అకౌంట్లో జమా కాలేదని ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లి, చక్రాయపేట, వేముల మండల టీడీపీ నాయకులకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రవి ఈ తరహా ఆరోపణలు చేశారు.
అమ్మఒడి కింద సీఎం జగన్ బటన్ నొక్కి చాలా రోజులు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదని తెలిపారు. అయితే డబ్బులు జమా కానప్పటికీ ఖాతాలో పడినట్టుగా చూపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఎవరి ఖాతాలో అయితే డబ్బులు జమా కాలేదో సదరు బాధితుల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి సీఎం జగన్ మీద చెక్ బౌన్స్ కేసు పెడతామని హెచ్చరించారు.
Also Read: Ashadam: ఆషాడమాసంలో నవ దంపతులు దూరం ఉండడం వెనుక కారణం ఇదే?