HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Botsa Satyanarayana Respond On Perni Nani Attack

Botsa : పేర్నినాని పై దాడి..రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుంది: బొత్స

గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని బొత్స అన్నారు.

  • Author : Latha Suma Date : 01-09-2024 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Botsa Satyanarayana Respond
Botsa Satyanarayana respond on Perni Nani attack

Botsa Satyanarayana: జనసైనికులు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కొడి గుడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దాడిపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని బొత్స అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీకి మాజీమంత్రి ఫోన్‌ చేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కొనసాగుతుంది.. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు చేశారు. కార్లపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన టీడీపీ, జనసేన నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం, దాడులు జరిగాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

ఇక, ఈ దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల దగ్గర మరో కారును ఉంచిన మాజీమంత్రి పేర్నినాని డ్రైవర్‌.. ఆ విషయం తెలుసుకుని.. అక్కడకు వెళ్లి మరీ కారుపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారని బొత్స నారాయణ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయి.. వైసీపీ పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. పోలీసులు తమ కర్త్యవాన్ని నిర్వహించి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఈ ఘటనలు నిదర్శనం అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Read Also: Hero Vijay : హైదరాబాద్ లోని మాస్ థియేటర్ లో సలార్ చిత్రాన్ని చూసిన హీరో విజయ్

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • botsa satyanarayana
  • Janasena
  • perni nani
  • ysrcp

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Balineni

    Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd