AP Politics: పురందేశ్వరిపై సెటైర్స్ పేల్చిన విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విజయసాయిరెడ్డి పురందేశ్వరి వైఖరిపై సెటైరికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
- Author : Praveen Aluthuru
Date : 30-07-2023 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
బాబు స్క్రిప్ట్..వదిన డైలాగ్స్
బీజేపీ అంటే బాబు జనతా పార్టీ
పురందేశ్వరి అద్భుతమైన నటి: విజయసాయిరెడ్డి
AP Politics: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విజయసాయిరెడ్డి పురందేశ్వరి వైఖరిపై సెటైరికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. పురందేశ్వరి నటకిరీటి నందమూరి తారకరామారావు కంటే గొప్పగా నటిస్తున్నదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు ఎన్టీఆర్ మాత్రమే నటుడు అనుకున్నామని, పురందేశ్వరి నటనను గుర్తించలేకపోయామని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదని సెటైర్స్ పేల్చారు. బాబుది స్క్రిప్ట్… వదినది డైలాగ్ అంటూ వ్యాఖ్యానించారు. తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ…మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్ గా కనిపిస్తున్నదని అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Conjunctivitis: ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న కళ్ళ కలక కేసులు