Guntur Tower: జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే…బీజేపీ డెడ్ లైన్..!!
దేశవ్యాప్తంగా పేరుమార్పుల హవా కొనుసాగుతోంది. ఈ సమయంలో ఏపీలోని జిన్నా టవర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ.
- Author : Hashtag U
Date : 25-05-2022 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా పేరుమార్పుల హవా కొనుసాగుతోంది. ఈ సమయంలో ఏపీలోని జిన్నా టవర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. కొద్ది వారాలుగా పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఆకస్మాత్తుగా స్పీడ్ పెంచింది. ఆగస్టు 16వ తేదీలోపు జిన్నా టవర్ కు పేరు మార్చకపోతే…ప్రజల ఆగ్రహావేశాలతో ఏమైనా జరగొచ్చని హెచ్చరిస్తోంది.
ఈ మేరకు ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్…జిన్నా టవర్ పేరు మార్చాలని శాంతియుతంగా కోరితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గొంతెత్తితే మాపై అక్రమ కేసులు మోపుతున్నారు. నరహంతకుడు జిన్నా…అలాంటి పేరును తొలగించి దేశ స్వాతంత్ర్య సమరయోధులతోపాటు మిగతా ఎవరి పేరైనా పెట్టమని కొరుతున్నామంటు చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా పోరాటం కారణంగానే జిన్నా టవర్ కు రంగులు మార్చడం సాధ్యమైందన్నారు. దీనిపై స్పందించారు. రంగులు మారిస్తే జిన్నా చేసిన అకృత్యాలు, అరాచకాలు మారుతాయా అంటూ ప్రశ్నించారు.
జిన్నా పేరు మార్చేందుక మీకేం ఇబ్బంది…నరహంతకుడైన జిన్నా టవర్ కు పేరు మార్చాలి. జిన్నా పిలుపుతో వేల కోట్ల ఆస్తుల అక్రమాలు జరిగాయి. 5వేల మంది ఊచకోతకు గురయ్యారు. ఆ కోవలోనే ఆగస్టు 16వ తేదీలోగా జిన్నా టవర్ పేరు మార్చాలని…లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. అలా జరగకపోతే…ప్రజల మనోభవాలు ఎలా ఉంటాయో ఆగస్టు 16 తర్వాత చూపిస్తామంటూ హెచ్చరించారు.