HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Biryani For Borragadda Anil Kumar Seven Police Officers Suspended

Borugadda Anil Arrest: బోరుగడ్డకు బిర్యానీ.. ఏడుగురు పోలీసులు సస్పెండ్!

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు ఎస్కార్ట్ పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓ లగ్జరీ హోటల్‌కు తీసుకెళ్లి చికెన్, మటన్‌తో నాన్ వెజ్ భోజనం అందించారు. ఈ ఘటన పోలీసు పెద్దల దృష్టికి వచ్చి, వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 07-11-2024 - 1:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Borugadda Anil Arrest
Borugadda Anil Arrest

బోరుగడ్డ అనిల్‌కుమార్‌, అతను రౌడీషీటర్‌గా పేరుగాంచాడు. నోటికి అడ్డూ అదుపు ఉండేది కాదు. బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తూ పేట్రేగిపోయాడు. ఎంతగానో ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఫోన్లు చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. గతంలో, విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను అసభ్య పదజాలంతో దూషించాడు. వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుగా వ్యాఖ్యానించాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాపం పండింది.

రాష్ట్రంలో గవర్నమెంట్ మారడంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. అయితే, జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అనిల్‌కుమార్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు అతడిని ఓ వీఐపీలా ట్రీట్ చేశారు. లగ్జరీ రెస్టారెంట్‌లో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విషయం ఏపీ స్టేట్ పోలీస్ బాస్‌కు తెలియడంతో, విచారణ చేపట్టారు. ఈ ఘటన ఘటనకు పాల్పడిన 7 మంది పోలీసులను సస్పెండ్ చేసారు.

బోరుగడ్డ అనిల్‌కుమార్‌ పై తుళ్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి, పోలీసులు బుధవారం అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకువచ్చి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ పూర్తయ్యాక, మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి రాజమండ్రికి పయనమయ్యారు.

బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ను జడ్జి ఎదుట హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ టీమ్‌గా గుంటూరు జిల్లా ఏఆర్‌కు చెందిన RSI పి.నారాయణరెడ్డి నేతృత్వంలో, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు, ఏఆర్‌ కానిస్టేబుళ్లు టి.శంకరరావు, కె.బుచ్చయ్య, తాడికొండ పీఎస్‌ కానిస్టేబుల్ ఎస్‌.ఏ.సద్దులా, తుళ్లూరు పోలీసు స్టేషన్ కానిస్టేబుళ్లు బాల ఎం.శౌరి, నాగరాజు ఉన్నారు.

రూల్స్ ప్రకారం, రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ కు వాహనంలోనే ఆహారం అందించాల్సి ఉంటుంది. కానీ, పోలీసు అధికారులు అతడిని వీఐపీలా ట్రీట్ చేశారు. గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి, అనిల్‌ను దర్జాగా లోపలికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి మాంసాహార భోజనం ఇచ్చారు. అతనితో పాటు ఎంచక్కా లంచ్ కూడా చేశారు. అందరూ కలిసి విందు భోజనం చేసిన తరువాత, బిల్‌ను అనిల్‌ చెల్లించినట్టు గమనించవచ్చు.

రౌడీ షీటర్‌కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్లిన పోలీసులు.అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించిన పోలీసులు.#borugaddaanil pic.twitter.com/nmdjOnpbFH

— Hashtag U (@HashtaguIn) November 7, 2024

ఇక, ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లలో షూట్ చేస్తోన్న వారిని పోలీసులు బెదిరించి, వీడియోలను డిలీట్ చేయించారు. విషయం తెలుసుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలోనే సంబంధిత పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత, వారిపై చర్య తీసుకోబడింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap police
  • AP Police Suspended
  • Borugadda anil
  • Borugadda Anil Arrest
  • dgp dwaraka tirumala rao

Related News

Anudeep Katikala Arrest

Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.

Anudeep Katikala హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో

    Latest News

    • నేపాల్ వెళ్తున్నారా? జాగ్రత్త! రూ. 63 దాటితే చాలు ట్యాక్స్ కట్టాల్సిందే!

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • మరింత చవగ్గా కొత్త 390 డ్యూక్.. 350cc ఇంజిన్‌తో లాంచ్!

    • ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ!

    • ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

    Trending News

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd