HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bird Flu Chickens As Fodder For Fishes Bird Flu Virus Infects A Man In Eluru District

Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్‌లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం.

  • By Pasha Published Date - 12:26 PM, Thu - 13 February 25
  • daily-hunt
Bird Flu Chickens As Fishes Fodder Bird Flu Infection Eluru District Andhra Pradesh

Bird Flu Chickens: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ  కలకలం రేపుతోంది. దీంతో జనం చికెన్, కోడి గుడ్లు తినడం లేదు. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక  వ్వక్తి కి బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. కోళ్ల ఫామ్ సమీపంలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వైద్యాధికారులు అతడి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. అక్కడ శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా,  సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ ఉందని వెల్లడైంది. దీంతో వైద్యాధికారులు ఉంగుటూరు మండలంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మనుషుల్లో నమోదైన తొలి బర్డ్ ఫ్లూ కేసు ఇదేనని వైద్యాధికారిణి డాక్టర్‌ మాలిని చెప్పారు.

Also Read :Rs 6000 Crore Dump: ఈ చెత్తకుప్పలో రూ.6,500 కోట్ల బిట్‌కాయిన్లు.. కొనేందుకు టెకీ రెడీ

కోళ్లను  పూడ్చిపెట్టే పనిని.. 

ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది.  దీంతో ఆ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను అధికారులు రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా వేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు తాజా బయటికి వచ్చాయి. సాధారణంగా చేపల చెరువుల నిర్వాహకులు చికెన్‌ షాపుల్లోని వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా కోళ్లనే చేపలకు దానాగా వేస్తున్నారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను  పూడ్చిపెట్టడం అనేది ఖర్చుతో కూడుకున్న పని.  అందుకే పలు కోళ్ల ఫామ్‌‌ల యజమానులు చనిపోయిన కోళ్లను చేపల చెరువుల నిర్వాహకులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తద్వారా పూడ్చిపెట్టే ఖర్చుల నుంచి బయటపడుతున్నారు.

Also Read :Kalvakuntla Kavitha: జగిత్యాల సీటుపై కవిత ఫోకస్.. టార్గెట్ అసెంబ్లీ

పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలు

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్‌లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం. గత మూడు రోజుల్లో తణుకు మండలంలోని వేల్పూరు, పెరవలి మండలం కానూరు అగ్రహారం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bird flu
  • Bird Flu Chickens
  • Bird Flu infection
  • Eluru district
  • Fishes Fodder

Related News

Amaravati Ttd Temple

Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్‌ ప్లాన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్‌‌గా ఉండటంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్నప్రసాదం భవనాన్ని విస్తరించాలని చెప్పారు. ఇక కృష్ణమ్మకు నిత్యహారతి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాగా, విస్తరణలో భాగంగా ఆలయాన్ని సర

  • Dwaraka Tirumala

    Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్

Latest News

  • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

  • Akhanda 2 : నిర్మాతలకు ఆర్ధిక సాయం చేసేందుకు సిద్దమైన బాలయ్య

  • AP Economic Growth : ఆర్ధికంగా బలపడుతున్న ఏపీ..ఇది కదా బాబు మార్క్ అంటే !!

  • iBOMMA : Ibomma రవికి ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదు – డీసీపీ క్లారిటీ

  • PTM-3.0 : ఏపీలో ఈరోజు మెగా PTM

Trending News

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

    • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

    • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd