HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bhairava Prasad Domestic Violence Case Filed Against Kadiri Jana Sena Leader Bhairava Prasad

Bhairava Prasad: కదిరి జనసేన నేత భైరవ ప్రసాద్ పై గృహహింస కేసు..

  • Author : Vamsi Chowdary Korata Date : 18-05-2026 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena kadiri leader bhairava prasad
Janasena kadiri leader bhairava prasad

కదిరి జనసేన పార్టీ నేత భైరవ ప్రసాద్‌పై కేసు నమోదైంది. తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనికి ఉన్న అలవాట్ల గురించి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై తనపై దాడి చేశాడని భైరవ ప్రసాద్ భార్య శశికళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తలతో పాటు శరీరంలోని పలుచోట్ల ఐరన్ రాడ్‌తో కొట్టి గాయపరిచాడని ఆమె ఆరోపించారు. అడ్డుకునేందుకు వచ్చిన తన కూతురు సాయి వర్షిణిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీసులు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జనసేన పార్టీ ముఖ్య నేతపై కేసు నమోదైంది. భార్య, కూతురు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. శ్రీ సత్య సాయి కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, లాయర్ భైరవ ప్రసాద్ కుటుంబం కదిరి టౌన్‌లోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. భైరవ ప్రసాద్ భార్య శశికళ, కూతురు సాయి వర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

భైరవ ప్రసాద్ భార్య, తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయనకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి అడిగినందుకు ఇనుప రాడ్‌తో తనపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకున్నందుకు తన కుమార్తె సాయి వర్షిణిపై ప్రసాద్ దాడి చేసినట్లు చెప్పారు. తల్లీకూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రసాద్ దాడిలో శశికళ తలకు బలమైన గాయమైంది. భార్య ఫిర్యాదుతో ప్రసాద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ప్రసాద్ భార్య శశికళ, కుమార్తె సాయి వర్షిణి నుంచి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. అలాగే కేసు నమోదు కావడంతో పోలీసులు భైరవ ప్రసాద్‌ను పిలిచి విచారణ చేస్తారా.. అదుపులోకి తీసుకుంటారా అన్నది చూడాలి. ప్రసాద్ స్వతహాగా లాయర్ కూడా కావడంతో కోర్టుకు వెళ్లి బెయిల్ ప్రయత్నాలు ఏవైనా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

భైరవ ప్రసాద్ ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్‌ను కూడా కలిశారు. సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు. అయితే ఇంతలో భార్య, కుమార్తెపై దాడి చేశారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార కూటమిలో ఉన్న నేతపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. భార్య ఆరోపణలపై భైరవ ప్రసాద్ ఎలాంటి వివరణ ఇస్తారనేది కీలకంగా మారింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • Bhairava Prasad
  • domestic violence case
  • Files Case
  • janasena party
  • Kadiri

Related News

Janasena strengthens its position in Telangana politics; another key decision taken recently.

Janasena Party: తెలంగాణ రాజకీయాల్లో జనసేన బలోపేతం.. తాజాగా మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన ఫోకస్ పెంచింది. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణ మొదలుపెట్టారు.   View this post on Instagram   A post shared by JanaSena Telangana (@jsptelangana) రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడాని

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd