Bandaru Satyanarayana : బండారు సత్యనారాయణ కు వైసీపీ ఎంపీ టికెట్..?
బండారు సత్యనారాయణ నియోజకవర్గం పెందుర్తి స్థానం ఇప్పుడు పొత్తులో జనసేనకు వెళ్లింది. ఈ క్రమంలో సీటు ఆశించి భంగపడిన బండారు..పార్టీ అధినేత ఫై ఆగ్రహం గా ఉన్నారు
- Author : Sudheer
Date : 18-03-2024 - 4:27 IST
Published By : Hashtagu Telugu Desk
కూటమి గా టిడిపి (TDP) , జనసేన (Janasena) , బిజెపి (BJP) లు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా జనసేన , టీడీపీ పార్టీలు కీలక స్థానాల్లో తమ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వలేకపోయాయి. దీంతో కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన మాకు టికెట్ ఇవ్వరా అంటూ ఇప్పటికే చాలామంది అధినేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) కూడా ఒకరు.
విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు కారణంగా పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ లాంటి నేతలు సీటు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బండారు సత్యనారాయణ నియోజకవర్గం పెందుర్తి (Pendurthi) స్థానం ఇప్పుడు పొత్తులో జనసేనకు వెళ్లింది. ఈ క్రమంలో సీటు ఆశించి భంగపడిన బండారు..పార్టీ అధినేత ఫై ఆగ్రహం గా ఉన్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు..బండారు తో టచ్ లోకి వెళ్లారు. తమ పార్టీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారట. పెందుర్తి అసెంబ్లీ స్థానం ఇప్పటికే అదీప్ రాజ్ కు వైసీపీ కేటాయించింది. అయితే, బండారుకు అనకాపల్లి ఎంపీ సీటు (Anakapalli MP seat ) ఇస్తామని వైసీపీ నుంచి హామీ దక్కినట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
అయితే బండారు సత్యనారాయణ వైసీపీలో చేరితే అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఫ్యాన్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బండారు సత్యనారాయణ, అచ్చెన్నాయుడి కుటుంబం వియ్యంకులు కావడంతో అనకాపల్లిలో రాజకీయ సమీకరణాలు మారతాయని అంత భావిస్తున్నారు. అలాగే జనసేనకు సీట్లు కేటాయించిన ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని టీడీపీ అసంతృప్తులను బండారు చేరదీస్తున్నారని సమాచారం. వారందరితో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని పైన బండారు స్పందించారు. తాను తన మద్దతు దారులతో చర్చలు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల్లోనే తన నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. బండారు మాటలు చూస్తే ఖచ్చితంగా ఈయన వైసీపీ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే విశాఖ లో టీడీపీ పెద్ద మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : Singer Mangli : నేను బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ పై మంగ్లీ పోస్ట్..