Singer Mangli : నేను బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ పై మంగ్లీ పోస్ట్..
నేను బాగానే ఉన్నాను అంటూ యాక్సిడెంట్ పై రియాక్ట్ అవుతూ సింగర్ మంగ్లీ పోస్ట్ వేశారు.
- By News Desk Published Date - 04:17 PM, Mon - 18 March 24
Singer Mangli : తెలుగు ఫోక్ సాంగ్స్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న సింగర్ మంగ్లీ.. అటు సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ పడుతూనే, ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డివోషనల్ సాంగ్స్ తో సూపర్ పాపులారిటీని అందుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక మహోత్సవాల్లో తన గాత్రం వినిపిస్తూ సందడి చేస్తుంటారు. తాజాగా ఈమె రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చెందిన కన్హా శాంతి వనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి వెళ్లారు.
మార్చి 16న ఉదయం ఆమె అక్కడికి వెళ్లారు. ఆరోజు అర్ధరాత్రే అక్కడి నుంచి కారులో మంగ్లీ ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో ఆమెతో పాటు కారులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. హైదరాబాద్-బెంగళూర్ హైవే పై ఇంటికి వస్తుండగా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వంతెన వద్ద ఒక డీసీఎం వెనుక నుంచి మంగ్లీ కారుని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీకి గాని, కారులో ఉన్న ఇతర వ్యక్తులకు గాను ఎటువంటి గాయాలు అవ్వలేదు. మంగ్లీ కారు మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యింది.
డీసీఎం డ్రైవర్ మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. శంషాబాద్ పోలీసులు ఆ డ్రైవర్ ని కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మంగ్లీ కూడా యాక్సిడెంట్ కి గురైన తన కారులోని సురక్షితంగా ఇంటికి చేసుకున్నారు. అయితే ఈ విషయం రెండు రోజుల తరువాత ఇవాళ బయటకి వచ్చింది. ఇక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, మంగ్లీకి గాయాలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో మంగ్లీ అభిమానులు.. ఆమెకు ఏం జరిగిందంటూ కంగారు పడుతున్నారు. ఇక ఈ గందరగోళానికి చెక్ పెట్టడం కోసం మంగ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేశారు. “నేను క్షేమంగానే ఉన్నాను. ఎటువంటి రూమర్స్ ని నమ్మొద్దు. ఇది జరిగి రెండు రోజులు అవుతుంది. నేను ప్రస్తుతం ఇంటిలో క్షేమంగానే ఉన్నాను” అంటూ పోస్ట్ వేశారు.
Read Also : Venkatesh – Son In Law : విక్టరీ వెంకటేష్ రెండో అల్లుడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా ?
Related News
Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. డీసీఎం కారును ఢీకొట్టడంతో!
తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతున్నా విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెండితెరపై వరుసగా పాటలను పాడుతూ భారీగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగానే భారీగా పారితోషికాన్ని కూడా అందుకుంటోంది మంగ్లీ. ఈమె ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక