Viral : బాలయ్య కు దండ వేసాడు..లక్కీ అనిపించుకుంటున్నాడు
కారుపై నిలబడి అభివాదం చేస్తుండగా గుంపులో నుంచి బాలయ్య అభిమాని వేగంగా పరిగెత్తుకొచ్చి అభిమాన హీరో మెడలో పూల దండవేసి దండంపెట్టాడు
- Author : Sudheer
Date : 19-04-2024 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి బాలకృష్ణ (Balakrishna) ను ఒక్కసారైనా చూడాలని..ఒక్కసారైనా ఆయనతో కలిసి ఫోటో దిగాలని..ఒక్కసారైనా టచ్ చేయాలనీ ఇలా కోట్లాది మంది అభిమానులకు కొరికేలు ఉంటాయి. కానీ ఆ అందరికి ఆ కోరిక తీరదు..ఎవరో కొంతమంది లక్కీ వాళ్లకే ఆ కోరిక తీరుతుంటుంది. ఎవరైనా ఏదైతే అది వారి కోరిక తీర్చుకోవాలని చూస్తే..ఫోటో కాదు బాలయ్య చేతి వాటం చూస్తుంటారు. కొంతమంది అభిమానులైతే (Fans) ఇలాగైనా బాలకృష్ణ తమను టచ్ చేస్తారని చెప్పి..కావాలని ఆయనకు కోపం తెప్పించి దెబ్బలు తింటుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం బాలకృష్ణ ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బిజీ గా ఉన్నారు. హిందూపురం నుండి మరోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. అలాగే కూటమి తరుపున ఆయన ప్రచారం కూడా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కారుపై నిలబడి అభివాదం చేస్తుండగా గుంపులో నుంచి బాలయ్య అభిమాని వేగంగా పరిగెత్తుకొచ్చి అభిమాన హీరో మెడలో పూల దండవేసి దండంపెట్టాడు. ఈ ఘటన చూసి అంత షాక్ అయ్యారు. బాలకృష చేతిలో అతడికి దెబ్బలు పడ్డట్లే అని అనుకున్నారు..కానీ బాలకృష్ణ మాత్రం..దండ వేసిన వ్యక్తిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇది చూసి అభిమానులంతా లక్కీ అంటే నీదే బ్రో ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి.
Lucky boy pic.twitter.com/2vtLosB6EP
— Arehoo_official (@tweetsbyaravind) April 18, 2024
Read Also : Elections – Nomination : తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంతమంది నామినేషన్ వేశారంటే..!!