TDP: అనంతపురంలో జగన్ పిశాచికం:బాబు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు కుటుంబం ఆత్మహత్య కు కారణం జగన్ పైశాచిక పాలన అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
- Author : CS Rao
Date : 08-05-2022 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు కుటుంబం ఆత్మహత్య కు కారణం జగన్ పైశాచిక పాలన అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. దళితుని ఇల్లు కూల్చిన ఘటనను చంద్రబాబు ఖండించారు.
ఇల్లు కూల్చివేతపై ఆవేదనతో లేని వారని దళితులను అణగదొక్కే చర్యలను దళిత జాతి క్షమించదని చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి వెంటనే ఇంటిని మంజూరు చెయ్యడంతో పాటు, వారిని వేధనకు గురి చేసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం రాదనే అంశం ప్రతి రోజూ నిరూపణ అవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దళితుల ఇళ్లను కూడా కూల్చి రాక్షసానందం పొందుతున్నారని జగన్ ప్రభుత్వంపై మండి పడ్డారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడెయ్యడానికి ఎమ్మెల్యే, ఆర్డివో, పోలీసులతో పాటు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చెయ్యడం పై చంద్ర బాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు.