Seshachalam Forest : విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారింది
Seshachalam Forest : ఈత కొట్టేందుకు వాటర్‌ఫాల్స్‌లోకి దిగిన సమయంలో సాయిదత్త అనే విద్యార్థి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు
- By Sudheer Published Date - 01:32 PM, Sat - 4 January 25

కొన్ని సార్లు అనుకోని ప్రమాదాలు..ప్రాణాలు పోయేలా చేస్తాయి. అప్పటివరకు మనతో ఉన్న వారు సడెన్ గా తిరిగిరాని లోకానికి వెళ్లి శోకసంద్రంలో పడేస్తుంటారు. ముఖ్యంగా విహార యాత్రలకు వెళ్లిన సమయంలో ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా శ్రీకాళహస్తి(Srikalahasti)కి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు (B.Tech Students) విహారయాత్ర (Sightseeing Tour) కాస్త విషాదయాత్ర (Tragedy) గా మారింది.
700 Women Extortion: ‘అమెరికా మోడల్‌ను’ అంటూ.. 700 మంది అమ్మాయిలకు కుచ్చుటోపీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు వెళ్లారు. శుక్రవారం ఉదయం శేషాచలం వాటర్‌ఫాల్స్ వద్దకు చేరుకుని విద్యార్థులు మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతంలో తిరిగారు. ఆ తర్వాత ఈత కొట్టేందుకు వాటర్‌ఫాల్స్‌లోకి దిగిన సమయంలో సాయిదత్త అనే విద్యార్థి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. సాయిదత్తను రక్షించేందుకు అతడి స్నేహితులు ఎంతో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అతడి మరణంతో విద్యార్థులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. స్నేహితుడి మృతదేహాన్ని తీసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెట్టిన విద్యార్థులు చీకటి కమ్ముకోవడంతో దారితప్పి అడవిలో చిక్కుకుపోయారు.
Maha Kumbh Mela 2025 : 32 ఏళ్లుగా స్నానం చేయకుండా మహా కుంభమేళాలో పాల్గొంటున్న స్వామీజీ
సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఎవరికీ సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అడవిలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భయంతో గడిపిన విద్యార్థులు చివరికి ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. తాము ఉన్న లొకేషన్‌ను షేర్ చేయడంతో వెంటనే రైల్వే కోడూరు పోలీసులు, అటవీశాఖ అధికారులు విద్యార్థులను రక్షించేందుకు అడవిలోకి వెళ్లారు. అర్ధరాత్రి సమయానికి విద్యార్థులు ఉన్న ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాయి మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.