HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Avinash Reddy Arrest Latest News

YS Avinash Reddy : అవినాష్ రెడ్డి కి బిగిస్తున్న ఉచ్చు

YS Avinash Reddy : విచారణను తప్పించుకోవడానికి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి

  • Author : Sudheer Date : 26-03-2025 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Avinash
Ys Avinash

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) విచారణలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) పాత్రపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. విచారణను తప్పించుకోవడానికి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీబీఐ అధికారులపై తప్పుదోవ పట్టించేలా తప్పుడు కేసులు పెట్టడం, వివేకా కుటుంబసభ్యులనే నిందితులుగా మార్చే ప్రయత్నాలు చేసినట్లు అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

PF Amount Withdraw: మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే సింపుల్‌గా డ‌బ్బు విత్ డ్రా చేసుకోండి ఇలా!

వివేకా కుమార్తె డాక్టర్ సునీత కేసును తీవ్రంగా తీసుకుని పోరాడుతుండటంతో అవినాష్ రెడ్డి వర్గం ఆమెపై కుట్ర పన్నింది. హత్య జరిగిన వెంటనే పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసి పోస్టుమార్టం జరగకుండా చూసేందుకు ప్రయత్నించారు. కానీ సునీత నిరసన వ్యక్తం చేయడంతో అంతిమక్రియలు నిలిపివేయాల్సి వచ్చింది. పైగా సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి సహకరించకపోవడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

CM Chandrababu : బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దాం : సీఎం చంద్రబాబు

ఈ కేసు సీబీఐకి ప్రతిష్టాత్మకంగా మారినందున అన్ని కోణాల్లోనూ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. విచారణను తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందనే దానిపైనే ఇక అవినాష్ భవితవ్యాన్ని ఆధారపడి ఉంటుంది. కేసు మలుపులు, తాజా పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే వివేకా హత్య కేసులో పెద్ద సంచలనాలు వెలుగు చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI Enquiry
  • Supreme Court
  • YS Avinash Reddy
  • YS Vivekananda murder case

Related News

Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం

Ananta Babu case  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును వ

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

  • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd