Attack On CM Jagan With Stone : సీఎం జగన్ ఫై రాయి తో దాడి.. రేపు బంద్ పిలుపునిచ్చే ఆలోచనలో వైసీపీ
బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఓ ఆగంతకుడు జగన్‌పై రాయిని విసిరారు.
- Author : Sudheer
Date : 13-04-2024 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం జగన్ బస్సు యాత్ర(Jagan Bus yatra)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేమంతా బస్సు యాత్రలో జగన్‌పై రాయి(Stone Attacj)తో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఓ ఆగంతకుడు జగన్‌పై రాయిని విసిరారు. అత్యంత వేగంగా జగన్ ఎడుమ కనుబొమ్మకు రాయి తగలడంతో గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటన తర్వాత వెంటనే జగన్‌కు బస్సులో ఉన్న వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు. యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ప్రతిపక్షాలు ఓర్వలేకే దాడికి పాల్పడినట్లు వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తుంటే..మరికొంతమంది మాత్రం ఇది గంజాయి బ్యాచ్ పనే అంటున్నారు. ఇదే క్రమంలో విజయవాడ కు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు , శ్రేణులు చేరుకుంటున్నారు. రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని వైసీపీ శ్రేణులు పట్టుబడుతున్నారు. మరి రేపు జగన్ బస్సు యాత్ర చేస్తారా..? లేక రెస్ట్ తీసుకుంటారా అనేది చూడాలి. ఇక ఈ దాడికి పాల్పడింది ఎవరా అనే కోణంలో దర్యాప్తు చేపుడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరా లు చెక్ చేస్తున్నారు.
Read Also : Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్