Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భూకబ్జాలకు పాల్పడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
- By Praveen Aluthuru Published Date - 08:01 PM, Sat - 13 April 24

Danam Land Grab: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భూకబ్జాలకు పాల్పడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఓ టీవీ చానెల్ డిబేట్‌లో మాట్లాడిన కేటీఆర్.. దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌లో ఉన్నంత వరకు ఆయన భూకబ్జాకు పాల్పడకుండా చూశామని చెప్పారు కేటీఆర్. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మరుక్షణం ఆయన భూకబ్జాకి పాల్పడ్డారని ఆరోపించారు. మెుత్తం 700 గజాల స్థలం కబ్జా చేశారని,అవసరం అయితే సంబంధిత ఫుటేజ్‌ను ఇస్తానని చెప్పారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3లో రూ. 20 కోట్ల విలువైన భూమికి సంబంధించిన కొన్ని చిత్రాలు మరియు వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
We’re now on WhatsApp. Click to Join
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాగేందర్ తన ఇంటి వెనుక ఉన్న 700 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అయితే ప్రభుత్వ అధికారులు మార్చిలో అక్కడికి వెళ్లి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు వేసి భూమిని భద్రపరిచారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు తొలగించబడిందని ఆరోపించారు.ఇందుకు సీఎం రేవంత్ అనుమతులు ఇచ్చారన్నారు.
Also Read: IPL 2024: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, భారీగా నగదు స్వాధీనం!