HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Atmasakshi Latest Survey Tdp 95 Plus This Is The Constituency Wise Report

Atmasakshi Survey: `ఆత్మ‌సాక్షి` లేటెస్ట్ సర్వే.. ‘బాబు’ వైపు ఏపీ మూడ్!

మూడు విడ‌త‌లుగా చేసిన స‌ర్వేలో తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి.

  • By CS Rao Published Date - 03:35 PM, Mon - 5 September 22
  • daily-hunt
Ap Survey 2
Ap Survey 2

`మూడ్ ఆఫ్ ఏపీ` పేరుతో శ్రీ ఆత్మ‌సాక్షి ( ఎస్ ఏ ఎస్ ) గ్రూప్ సెప్టెంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు మూడు విడ‌త‌లుగా చేసిన స‌ర్వేలో తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. ఆ స‌ర్వే ప్ర‌కారం టీడీపీ 95 స్థానాల్లోనూ, వైసీపీ 75, జ‌న‌సేన 5 స్థానాల‌ను కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే అంచ‌నా వేసింది.

మొత్తం 175 స్థానాల్లో టీడీపీ 77, వైసీపీ 56 స్థానాలను కైవ‌సం చేసుకునే అవకాశం క్లియ‌ర్ గా ఉందని స‌ర్వే చెబుతోంది. నాలుగు స్థానాల్లో జ‌న‌సేన గెలుస్తుంద‌ని అంచ‌నా వేసింది. నువ్వా? నేనా? అనే విధంగా 38 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఫైట్ ఉంద‌ని స‌ర్వే తేల్చింది. వాటిల్లో18 టీడీపీ, 19 వైసీపీ ఒక స్థానం జ‌న‌సేన‌కు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా వేసింది.

మూడు విడ‌త‌లుగా ఒక ల‌క్షా 37వేల 700 శాంపిల్స్ ద్వారా ఈ స‌ర్వేను ఆ సంస్థ నిర్వ‌హించింది. జూన్ 2 నుంచి జూలై 7వ తేదీ వ‌ర‌కు తొలి విడ‌త చేసిన స‌ర్వేలో 56వేల 200 శాంపిల్స్ తీసుకున్నారు. జులై 6 నుంచి ఆగ‌స్ట్ 12వ తేదీ వ‌ర‌కు చేసిన రెండో విడత స‌ర్వేలో 52వేల 500 శాంపిల్స్ సేక‌రించారు. ఇక మూడో విడ‌త స‌ర్వేను ఆగ‌స్ట్ 14 నుంచి సెప్టెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించారు. అందుకోసం 29వేల శాంపిల్స్ తీసుకున్నారు. స‌మాజంలోని 20 విభాగాల‌కు చెందిన ఓట‌ర్ల‌ను క‌లుసుకున్నారు. రాండమ్ గా 65వేల శాంపిల్స్ తీసుకున్నారు. ఎంపిక చేసిన వాళ్ల నుంచి 45వేలు, పార్టీల పొత్తు గురించి 27వేల మంది అభిప్రాయాన్ని రాండమ్ గా సేక‌రించారు. సుమారు 34 ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌మాణాల‌ను తీసుకుని స‌ర్వేను ఆ గ్రూప్ నిర్వ‌హించింది.

 

Also Read: Pawan Kalyan: ఉపాధ్యాయులను వేధిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు!

 

పొత్తుల‌పై ప్ర‌జాభిప్రాయం

టీడీపీ, జ‌న‌సేన పొత్తును 55శాతం మంది ఆహ్వానించారు. 35శాతం మంది వ్య‌తిరేకించ‌గా ఎటూ చెప్ప‌కుండా 5శాతం ఉన్నారు. ఇక బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తును 56శాతం తిర‌స్క‌రించ‌గా 30శాతం ఆహ్వానించారు. ఎటూ చెప్ప‌కుండా 14శాతం మంది ఉన్నార‌ని అంచ‌నా వేసింది. జ‌న‌సేన, బీజేపీ పొత్తుపై 55శాతం ఆహ్వానించ‌గా 35శాతం తిర‌స్కరించారు. 7శాతం మంది ఎటూ చెప్ప‌లేక‌పోయారు. జ‌న‌సేన‌తో సంబంధంలేకుండా టీడీపీ, బీజేపీ పొత్తును 62శాతం మంది తిర‌స్క‌రించ‌గా 32శాతం మంది ఆహ్వానించారు. 10శాతం ఎటూ చెప్ప‌లేకపోయారు. పొత్తుల్లేకుండా ఎవ‌రికి వారే పోటీ చేయ‌మ‌ని 48శాతం మంది అంటుండ‌గా 42శాతం తిర‌స్క‌రించారు. ఎటూ తేల్చ‌లేక 10శాతం ఉన్నారు. ఫైన‌ల్ గా జ‌న‌సేన‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం పొత్తును 67శాతం మంది ఆహ్వానించ‌గా 26శాతం తిర‌స్క‌రించారు. 7శాతం ఎటూ చెప్ప‌లేమ‌ని అన్నారు.

ఓటు షేర్

ఆయా పార్టీల‌కు ఏపీలో ఓటు షేర్ ను అంచ‌నా వేయ‌గా వైసీపీకి 43శాతం, టీడీపీ 44.5శాతం, జ‌న‌సేన‌కు 9శాతం, కాంగ్రెస్ + బీజేపీ + ఇత‌రులు 2శాతం, సైలెంట్ ఓటరు 1.5శాతంగా ఉంది. మొత్తం మీద 2019 కంటే వైసీపీ కోల్పోయిన ఓటు బ్యాంకు 6.95శాతంగా తేల్చారు. అదే టీడీపీ 5.25శాతం ఓటు బ్యాంకును రాబ‌ట్టుకుంది. జ‌న‌సేన 2.3శాతం ఓటు బ్యాంకును పెంచుకున్న‌ట్టు అంచ‌నా వేసింది. కానీ, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు 6.7శాతం వ‌చ్చిన‌ట్టు చూపారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీకి 49.95శాతం, టీడీపీకి 39.25శాతం జ‌న‌సేన కూట‌మికి వ‌చ్చిన ఓటు బ్యాంకు 6.7శాతంగా ఉంది. ఆ లెక్క‌న జ‌న‌సేన‌కు 2.3శాతం ఓటు బ్యాంకు పెరిగింద‌ని ఆత్మ‌సాక్షి నిర్థారించిన అంశాన్ని విశ్వాంసంలోకి తీసుకోలేం.

 

Also Read:  Balakrishna’s Anna Canteen: బాలకృష్ణ ‘అన్న‘ క్యాంటీన్ కు 100 రోజులు

 

జిల్లాల వారీగా ఆయా పార్టీలు గెలుచుకునే స్థానాలు

శ్రీకాకుళం జిల్లా:
ఆ జిల్లాలోని 10 స్థానాల్లో 6 స్థానాలు రాజాం, ఎడ్చ‌ర్ల, ఆముదాల‌వ‌ల‌స‌, ఇచ్చాపురం, టెక్క‌లి, పిఠాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుస్తుంద‌ని అంచ‌నా. కేవ‌లం శ్రీకాకుళం, పాల‌కొండ మాత్రం వైసీపీ విజ‌యం సాధిస్తుంది. టైట్ ఫైట్ ఉండే నియోజ‌క‌వ‌ర్గాలు ప‌లాస‌(2శాతం టీడీపీ లీడ్), న‌ర్స‌న్న‌పేట‌(3శాతం వైసీపీ లీడ్) ఉన్నాయి.

విజ‌య‌న‌గ‌రం జిల్లా:
మొత్తం 9 స్థానాల్లో 4 స్థానాలు బొబ్బిలి, ఎస్. కోట‌, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గాల‌ను టీడీపీ కైవ‌సం గెలుస్తుంద‌ని. మూడు స్థానాలు చీపురుప‌ల్లి, సాలూరు, నెల్లిమ‌ర్ల లో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయనుందని. అక్క‌డ గ‌ణ‌ప‌తిన‌గ‌రం(2శాతం వైసీపీ లీడ్), కురుపాం(2.5శాతం వైసీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో నువ్వా? నేనా? అనేలా పోటీ జ‌ర‌గ‌నుంది.

విశాఖ‌ప‌ట్నం జిల్లా:
మొత్తం 15 స్థానాల్లో టీడీపీ 5 స్థానాలు విశాఖ వెస్ట్, విశాఖ‌ ఈస్ట్, భీమిలిప‌ట్నం, పెందుర్తి, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలుచుకోనుందని. అలాగే, 5 స్థానాల్లో పాడేరు, అర‌కు వాలీ, య‌ల‌మంచిలి, విశాఖ‌ నార్త్‌, మాడుగుల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించ‌నుందని. విశాఖ‌ సౌత్‌(2.5శాతం వైసీపీ లీడ్), అన‌కాప‌ల్లి (3శాతం వైసీపీ లీడ్), పాయ‌క‌రావుపేట‌(3శాతం టీడీపీ లీడ్), చోడ‌వ‌రం(3.5శాతం వైసీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో నువ్వా? నేనా? అనేలా పోటీ జ‌ర‌గ‌నుంది.

 

Also Read: TDP : టీడీపీ `సోలో` ఫైట్ సో బెట‌ర్‌!

 

తూర్పు గోదావ‌రి జిల్లా:
మొత్తం 19 స్థానాల్లో టీడీపీ 8 స్థానాల్లో ముమ్మ‌డివ‌రం, కాకినాడ రూర‌ల్‌, రాజ‌మండ్రి సిటీ, అమ‌లాపురం, ప్ర‌త్తిపాడు, పెద్దాపురం, జ‌గ్గంపేట‌, పి. గ‌న్న‌వ‌రం స్థానాల‌ను గెలుచుకోనుందని. అదే 4 చోట్ల తుని, రామ‌చంద్రాపురం, రంప‌చోడ‌వ‌రం, మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ గెల‌వ‌నుందని. పిఠాపురం, రాజ‌మండ్రి రూర‌ల్ జ‌న‌సేన గెలుచుకుంటుందని. టైట్ ఫైట్ ఇచ్చేలా అన‌ప‌ర్తి(3శాతం టీడీపీ లీడ్), రాజాన‌గ‌రం(3.5శాతం వైసీపీ లీడ్), కొత్త‌పేట‌(3శాతం వైసీపీ లీడ్) , రాజోలు(2.5శాతం జ‌న‌సేన లీడ్), కాకినాడ సిటీ(2శాతం వైసీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లా:

మొత్తం 15 స్థానాల్లో 8 టీడీపీ, 3 వైసీపీ, 2 జ‌న‌సేన‌, 2 టైట్ ఫైట్ ఉంటాయ‌ని తేలింది. టీడీపీ గెలుచుకునే స్థానాల్లో దెందులూరు, నిడ‌ద‌వోలు, ఉండి, ఆచంట‌, పాల‌కొల్లు, గోపాల‌పురం, చింత‌ల‌పూడి, ఉంగుటూరు ఉన్నాయి. అదే వైసీపీ గెలుచుకునే నియోజ‌క‌వ‌ర్గాలు తాడేప‌ల్లి గూడెం, పోల‌వ‌రం, త‌ణుకు ఉండ‌గా, భీమ‌వ‌రం, న‌ర్సాపురం జ‌న‌సేన గెలుచుకోనుంది. ఏలూరు(3శాతం వైసీపీ లీడ్), కొవ్వూరు(3శాతం టీడీపీ లీడ్‌) నియోజ‌క‌వ‌ర్గాల్లో టైట్ ఫైట్ ఉంది.

కృష్ణా జిల్లా:
మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 7 స్థానాల‌ను, వైసీపీ 4 స్థానాల్లోనూ స్ప‌ష్టంగా గెలిచే అవ‌కాశం ఉంది. నువ్వా? నేనా? అనేలా 5 చోట్ల పోటీ జ‌ర‌గ‌నుంది. టీడీపీ గెలిచే స్థానాల జాబితాలో మైల‌వ‌రం, అవ‌నిగ‌డ్డ‌, పెడ‌న‌, పెన‌మ‌లూరు, విజ‌య‌వాడ‌(వెస్ట్), విజ‌య‌వాడ‌(సెంట్ర‌ల్‌), నందిగామ ఉన్నాయి. అదే వైసీపీ గెలుచుకునే స్థానాల్లో పామ‌ర్రు, గుడివాడ‌, నూజివీడు, గ‌న్న‌వ‌రం ఉన్నాయి. ఇక విజ‌య‌వాడ వెస్ట్(2శాతం వైసీపీ లీడ్), మ‌చిలీప‌ట్నం(3శాతం టీడీపీ లీడ్), తిరువూరు(2శాతం టీడీపీ లీడ్), కైక‌లూరు(3శాతం టీడీపీ లీడ్), జ‌గ్గ‌య్యపేట‌(4శాతం వైసీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో టైట్ ఫైట్ ఉంది.

 

Also Read: Chandrababu Naidu: డ్రామాలాడే లీడర్లకు టీడీపీ చెక్

 

గుంటూరు జిల్లా:
మొత్తం 17 స్థానాల్లో 10చోట్ల టీడీపీ, 4స్థానాల్లో వైసీపీ, 3 చోట్ల టైట్ ఫైట్ ఉంటుందని స‌ర్వే తేల్చింది. టీడీపీ గెలిచే అవ‌కాశం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వేమూరు, గుర‌జాల‌, పొన్నూరు, రేప‌ల్లె, తాడికొండ‌, బాప‌ట్ల‌, చిల‌క‌లూరిపేట‌, వినుకొండ‌, పెద‌కూర‌పాడు, మంగ‌ళ‌గిరి ఉన్నాయి. అలాగే వైసీపీ గెలిచే స్థానాల్లో మాచ‌ర్ల‌, న‌ర‌స‌రావుపేట‌, ప్ర‌త్తిపాడు, స‌త్తెన‌ప‌ల్లి ఉన్నాయి. ఇక గుంటూరు ఈస్ట్ (3శాతం వైసీపీ లీడ్), గుంటూరు వెస్ట్(2శాతం టీడీపీ లీడ్), తెనాలి(2శాతం వైసీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో టైట్ ఫైట్ ఉంది.

ప్ర‌కాశం జిల్లా:

మొత్తం 12 స్థానాల్లో టీడీపీ 7, వైసీపీ 4 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉండ‌గా, కంద‌కూరు(2.5శాతం టీడీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గంలో టైట్ ఫైట్ ఉంది. ఆ జిల్లాలో టీడీపీ గెలుచుకునే స్థానాలు ద‌ర్శి, క‌నిగిరి, ప‌ర్చూరు, అద్దంకి, ఒంగోలు, సంత‌నూత‌ల‌పాడు, కొండేపి ఉండ‌గా, చీరాల‌, ఎర్ర‌గొండ‌పాలెం, గిద్ద‌లూరు, మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకోనుంది.

నెల్లూరు జిల్లా:
మొత్తం 10 స్థానాలు ఉండ‌గా, 3 స్థానాల్లో టీడీపీ, 5 చోట్ల వైసీపీ గెలుచుకునే అవ‌కాశం ఉంది. టీడీపీ ఆ జిల్లాలో గెలుచుకునే స్థానాల్లో ఉద‌య‌గిరి, కావలి, నెల్లూరు సిటీ ఉన్నాయి. అలాగే వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల్లూరు రూర‌ల్, స‌ర్వేప‌ల్లి, సూళ్లూరిపేట‌, ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి ఉన్నాయని స‌ర్వే చెబుతోంది.

క‌డ‌ప జిల్లా:
మొత్తం 10 స్థానాల్లో టీడీపీ 1, వైసీపీ 5 గెలుచుకునే అవ‌కాశం ఉండ‌గా, 4 చోట్ల టైట్ ఫైట్ ఉంది. ఆ జిల్లాలోని మైదుకూరు నుంచి టీడీపీ గెల‌వ‌నుంది. అలాగే క‌డ‌ప‌, పులివెందుల‌, రాయ‌చోటి, జ‌మ్మ‌ల‌మ‌డుగు, బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ గెలుచుకోనుంది. ప్రొద్దుటూర్(2.5శాతం టీడీపీ లీడ్), రాజంపేట‌(3శాతం టీడీపీ లీడ్), క‌మ‌లాపురం(2శాతం వైసీపీ లీడ్), కోడూరు(2.5శాతం టీడీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, వైసీపీ నువ్వా? నేనా? అనేలా పోటీప‌డ‌నున్నాయి.

 

Also Read:  AP Politics: టీడీపీ వైపు పవన్,బీజేపీలోకి జూనియర్?

 

అనంత‌పురం జిల్లా:
మొత్తం 14 స్థానాలు ఉండ‌గా, టీడీపీ 7 చోట్ల‌, 6 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుచుకోనున్నాయి. ఉర‌వ‌కొండ‌(2.5శాతం టీడీపీ లీడ్‌) లో మాత్రం రెండు పార్టీల మ‌ధ్య టైట్ ఫైట్ ఉంది. టీడీపీ గెలుచుకునే స్థానాల్లో తాడిప‌త్రి, సింగ‌న‌మ‌ల‌, పెనుకొండ‌, అనంత‌పురం, హిందూపురం, క‌దిరి, క‌ళ్యాణ‌దుర్గం ఉన్నాయి. అదే, వైసీపీ గెలుచుకునే స్థానాల్లో రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం, గుంత‌క‌ల్, పుట్ట‌పుర్తి, రాయ‌దుర్గం, మ‌డ‌క‌శిరి ఉన్నాయి.

క‌ర్నూలు జిల్లా:
మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 స్థానాల్లో టీడీపీ, 5 చోట్ల వైసీపీ గెలువ‌నున్నాయి. 4 స్థానాల్లో టైట్ ఫైట్ న‌డ‌వ‌నుంది. ఆ జిల్లాలో టీడీపీ ఖాతాలోకి క‌ర్నూలు, ప‌త్తికొండ‌, శ్రీశైలం, పాణ్యం, మంత్రాల‌యం వెళ్ల‌నున్నాయి. అదే, ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, ఆదోని, బ‌న‌గాన‌ప‌ల్లి, నందికొట్కూర్ నియోక‌వ‌ర్గాల్లో వైసీపీ గెల‌వ‌నుంది. డోన్ (2శాతం వైసీపీ లీడ్), కోడ‌మూరు(2శాతం టీడీపీ లీడ్), ఆలేరు(3శాతం వైసీపీ లీడ్), మంత్రాల‌యం(3శాతం టీడీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య నువ్వా? నేనా? అనేలా పోటీ జ‌ర‌గ‌నుంది.

చిత్తూరు జిల్లా:
మొత్తం 14 స్థానాల్లో టీడీపీ 5, వైసీపీ 6 చోట్ల క్లియ‌ర్ క‌ట్ గా గెలిచే అవ‌కాశం ఉంది. 3 చోట్ల ఆ రెండు పార్టీల మ‌ధ్య టైట్ ఫైట్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ జిల్లా నుంచి గెలిచే స్థానాల్లో న‌గ‌రి, ప‌ల‌మ‌నేరు, కుప్పం, మ‌ద‌న‌ప‌ల్లి, స‌త్య‌వేడు ఉన్నాయి. అలాగే వైసీపీ గెలుచుకునే స్థానాల్లో పూత‌ల‌ప‌ట్టు, గంగాధార‌, నెల్లూరు, చిత్తూరు, పుంగ‌నూరు, చంద్ర‌గిరి, తిరుప‌తి ఉన్నాయి.ఇక పీలేరు(2.5శాతం టీడీపీ లీడ్), త‌మ్మళ్ల‌ప‌ల్లి(3శాతం టీడీపీ లీడ్), శ్రీకాళ‌హ‌స్తి(3.5శాతం వైసీపీ లీడ్) నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య నెక్ టూ నెక్ పోటీ ఉంది.

 

Also Read:  Pawan Kalyan : మీరు అలా చేస్తే..నేనే రోడ్డెక్కుతా..!!

 

మొత్తం మీద సెప్టెంబ‌ర్ 3 వ తేదీ వ‌ర‌కు స్ప‌ష్టంగా 77 స్థానాల్లో టీడీపీ గెలుచుకోనుందని శ్రీ ఆత్మ‌సాక్షి(ఎస్ ఏఎస్) స‌ర్వే తేల్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 56 స్థానాల‌ను గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. కేవ‌లం 4 స్థానాల‌కు జ‌న‌సేన పరిమితం కానుంది. ఏపీ వ్యాప్తంగా 38 చోట్ల టీడీపీ, వైసీపీ మ‌ధ్య నువ్వా ? నేనా? అనేలా పోటీ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాలే అధికారాన్ని నిర్ణ‌యించ‌బోతున్నాయని ఆ స‌ర్వేలోని సారాంశం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Elections
  • AP Elections
  • ap tdp
  • chandrababu naidu

Related News

Dussehra Festival

Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు

ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సెప్టెంబర్ 29న ములా నక్షత్రం రోజు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd