Jagan : జగన్ను 11KM గొయ్యి తవ్వి పూడ్చినా సిగ్గురాలేదు – అచ్చెన్న
Jagan : ముఖ్యమంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంప్రదాయాలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు
- By Sudheer Published Date - 07:00 AM, Fri - 12 September 25

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) బావిలో దూకి చావాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్ (Jagan) అవినీతి, మోసాలకు ప్రజలు విసిగిపోయి 11 కిలోమీటర్ల లోతు బావి తవ్వి పూడ్చినా సిగ్గు రాలేదని అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు. అలాగే, తప్పుడు ఫొటోలు సృష్టించి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
అంతేకాకుండా అచ్చెన్నాయుడు రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో 24,984 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ యూరియా ఈ నెల 22వ తేదీలోపు విశాఖపట్నం పోర్టుకు చేరుతుందని, తద్వారా రాష్ట్రంలోని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇది రైతులకు చాలా ఉపశమనం కలిగించే విషయం.
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. ముఖ్యమంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంప్రదాయాలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు. ఒక నాయకుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పక్షంపై ప్రతిపక్షం నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు.