APSRTC Employees : సీఎం జగన్‌ని కలిసిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు
- By Prasad Published Date - 06:24 PM, Tue - 27 September 22

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసినందుకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి చేర్చుకున్నామన్నారు. కరోనా సమయంలో కూడా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఆపలేదని గుర్తు చేశారు. అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నామని, గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంపు విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. 52 వేల మంది ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ లబ్ధి చేకూర్చారని పీటీడీ వైఎస్‌ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు చల్లా చంద్రయ్య కొనియాడారు. 10 వేల కోట్ల జీతాలు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును ప్రభుత్వం కాపాడిందని, అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు