Appireddy in key post : శాసన మండలి విప్ గా అప్పిరెడ్డి , జగన్ మార్క్ నియామకం
Appireddy in key post : ఎన్నికల క్రమంలో పదవులను వైసీపీ పంచుతోంది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
- By CS Rao Published Date - 03:28 PM, Thu - 5 October 23

Appireddy in key post : రాబోవు ఎన్నికల క్రమంలో నామినేటెడ్ పదవులను వైసీపీ పంచుతోంది. ఆ క్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వైసీపీ కేంద్ర కార్యాలయం ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనకు శాసన మండలి విప్ గా పదోన్నతి కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ ర్యాంకును పొందిన అప్పిరెడ్డి 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని అహర్నిశలు పార్టీ కోసం పనిచేశారు. క్షేత్రస్థాయిలో బలగం ఉన్న లీడర్ గా గుంటూరులో గుర్తింపు ఉంది.
శాసన మండలి విప్ గా పదోన్నతి కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం (Appireddy in key post)
ప్రభుత్వ విప్ లుగా ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ , పాలవలస విక్రాంత్ ను నియమించింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మురళీధర్ కు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం ద్వారా వైసీపీ ఎన్నికల ఈక్వేషన్ ను పాటించింది. అలాగే, బీసీ సామాజికవర్గానికి చెందిన విక్రాంత్ ను ప్రభుత్వ విప్ గా ప్రకటించడం ద్వారా వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. శాసన మండలి విప్ గా అప్పిరెడ్డి, ప్రభుత్వ విప్ లుగా మురళీధర్, విక్రాంత్ లను నియమిస్తూ ఒకేరోజు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థి, యువజన కాంగ్రెస్ లీడర్ గా ప్రారంభించిన రాజకీయ కెరీర్
పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా అప్పిరెడ్డిని గుంటూరు వరకు ఫాలోవర్స్ తీసుకెళ్లారు. భారీ ర్యాలీతో ఆయనకు లభించిన పదోన్నతిని ఆశ్వాదించారు. గత 30ఏళ్లుగా ఆయన అనుచరులు వేసిచూసిన పదవి తమ నాయకునికి దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి, యువజన కాంగ్రెస్ లీడర్ గా ప్రారంభించిన రాజకీయ కెరీర్ ఇప్పుడు విప్ వరకు ఎదిగింది. గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అప్పిరెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా పనిచేశారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన చిత్తశుద్దిగా పార్టీకి పనిచేసినందుకు గిప్ట్ గా విప్ పదవి లభించింది.
Also Read : CM Jagan : ఈ నాల్గు నెలలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిది – బండారు సత్యనారాయణమూర్తి
గుంటూరు జిల్లాలో పట్టున్న నాయకునిగా అప్పిరెడ్డికి గుర్తింపు ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఇంచార్జిగా నమ్మకంగా అప్పిరెడ్డి పనిచేశారు. అందుకు గుర్తింపుగా విప్ పదవి లభించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోవు ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పార్టీ బలంగా ఉండేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో అప్పిరెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించారని పార్టీ వర్గాల్లోని టాక్. ప్రభుత్వ విప్ లుగా ఎస్సీ, బీసీ నాయకులను నియమించడం కూడా ఎన్నికల వ్యూహంంలో భాగంగా చెబుతున్నారు.