CM Jagan : ఈ నాల్గు నెలలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిది – బండారు సత్యనారాయణమూర్తి
మహిళలంటే తనకెంతో గౌరవమని, గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని ఆ విధముగా మాట్లాడానని..
- Author : Sudheer
Date : 04-10-2023 - 3:43 IST
Published By : Hashtagu Telugu Desk
గత వారం రోజులుగా మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Former Minister Bandaru Satyanarayana Murthy) వార్తల్లో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. మంత్రి రోజా (Minister RK Roja) ఫై ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ కేసులో.. సొంత పూచీకత్తుపై సత్యనారాయణమూర్తిని విడుదల చేయాలని గుంటూరు మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కండిషన్డ్ బెయిల్ మంజూరు చేశారు. ఇలాంటి నేరానికి మరోసారి పాల్పడకూడదని.. సాక్ష్యులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయకూడదని.. దర్యాప్తు అధికారికి పూర్తిగా సహకరించాలని కోర్టు సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో బుధువారం మీడియా ముందుకు వచ్చిన సత్యనారాయణమూర్తి ..సీఎం జగన్ ఫై అలాగే రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్..ఉండే ఈ నాలుగు మాసాలైనా బుద్ధిమార్చుకుంటే మంచిదని హితవుపలికారు. ‘‘నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరం’’గా ఉందన్నారు. మహిళలంటే తనకెంతో గౌరవమని, గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా (Minister Roja) ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని ఆ విధముగా మాట్లాడానని సత్యనారాయణమూర్తి చెప్పుకొచ్చారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని తెలిపారు. రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కూడా విశ్లేషించుకోవాలని సత్యనారాయణమూర్తి సూచించారు.
Read Also : BRS : గుర్తు తెలగించాలంటూ ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ విజ్ఞప్తి