AP : ఇంకా ఎన్నాళ్లు ఈ డోలిమోతలు..మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడా..?
ప్రాణం మీదకు వస్తే చాలు..డోలి కట్టి మోత మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు కాదు ఎప్పటి నుండే ఇదే నడుస్తుంది. అర్ధరాత్రైనా..అపరాత్రైనా సరే నలుగురు తోడు తీసుకొని అరణ్యాలు దాటాల్సిందే
- By Sudheer Published Date - 07:37 AM, Thu - 2 November 23

దేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న..చంద్రుడి ఫై కాలు మోపి చరిత్రలో నిలిచిన..ఏపీ లో మాత్రం డోలిమోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న..మీము ఇది చేసాం అది చేసాం అని గొప్పగా చెప్పుకొచ్చిన..ఏజెన్సీ లో మాత్రం గిరిజనుల (Tribal People problems) తిప్పలు తప్పడం లేదు. పాలకులు ఎందరూ మారిన గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. మాటలు చెప్పే నాయకులు మాత్రమే ఉన్నారు కాని గిరిజనులు జీవితాలపై ఇప్పటివరకు ప్రత్యేక దృష్టి సారించింది ఎవరు లేరు. సరియైన వైద్యం అందక, రహదారులు లేక ఇప్పటికి గిరిజనలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రాణం మీదకు వస్తే చాలు..డోలి కట్టి మోత మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు కాదు ఎప్పటి నుండే ఇదే నడుస్తుంది. అర్ధరాత్రైనా..అపరాత్రైనా సరే నలుగురు తోడు తీసుకొని అరణ్యాలు దాటాల్సిందే. ఆ అరణ్యాలు దాటేసారి డోలి లో ఉన్న ప్రాణం ఉంటె దేవుడి దయ..లేదంటే కాటికే. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా..తాజాగా మరో డోలి ఘటన వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
అల్లూరి (Alluri) ఏజెన్సీ లో ప్రతిరోజు ఏదో ఒకచోట వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలంటే సరైన రహదారి సౌకర్యం లేక.. డోలిమోతలు కొనసాగుతూనే ఉన్నాయి. అరకులోయ మండలం ఇరగాయ పంచాయితీ జరిమానుగూడ గ్రామంలో పోయ స్వాతి అనే నిండు గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో.. వైద్యం కోసం బంధువులు డోలీమోతలోనే ఆసుపత్రికి తరలించారు. సుమారు ఏడు కిలోమీటర్ల దూరం డోలిమోత మోసుకొని గర్భిణీని గన్నెల వైద్య కేంద్రానికి తరలించారు. జరిమానుగుడ గ్రామం నుంచి అరకులోయ మండలం గన్నెల వైద్య కేంద్రానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డోలిమోత ద్వారానే గిరిజనులు తరలించారు. ప్రస్తుతం గర్భిణీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉంది. దేవుడి దయ వల్ల తమ బిడ్డ క్షేమంగా ఉందని ఆ తల్లిదండ్రులు చెపుతున్నారు. మరి వీరి కష్టాలు ఎప్పుడు తీరుతాయో..ఏ పాలకుడు వీరి కష్టాలు తీరుస్తాడో చూడాలి.
Read Also : BRS Minister: కాంగ్రెస్ గ్యారెంటీలు అన్ని బూటకం.. ఓట్ల కోసం మాత్రమే వాళ్ళ డ్రామాలు