HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Police Campaign Religion In Challan Form

AP Govt: ఏపీ పోలీసుల ఏసుక్రీస్తు బాట‌, చ‌లాన్ల వెనుక బోధ‌న‌లు!

ఏపీలో మ‌త పిచ్చి ముద‌రి పాకాన‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చ‌లాన్ల మీద ఏసు క్రీస్తు ప్ర‌బోధాలు ఉండ‌డం చూస్తే మ‌తం ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరింద‌ని అర్థం అవుతోంది.

  • Author : CS Rao Date : 26-11-2022 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Police
Ap Police

ఏపీలో మ‌త పిచ్చి ముద‌రి పాకాన‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చ‌లాన్ల మీద ఏసు క్రీస్తు ప్ర‌బోధాలు ఉండ‌డం చూస్తే మ‌తం ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరింద‌ని అర్థం అవుతోంది. స్థానికంగా ఉండే బీజేపీ నేత‌లు నిల‌దీయ‌డంతో పోలీసులు నాలుక్క‌రుసుకున్నారు. క్రీస్తు బోధ‌న‌ల‌తో ఉండే ర‌సీదుల జారీపై వాళ్లు కుంటిసాకులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

విశాఖ‌ రైల్వే స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ మ‌త ప్ర‌చారం వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. ఆటో ల‌కు జారీ జారీ చేసిన రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉన్నాయి. వాటిని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై విమర్శలతో పాటు బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న‌కు దిగింది. విశాఖ పోలీసులు ఈ రసీదుల జారీపై స్పందించారు. ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇవ్వ‌డం కొస‌మెరుపు.

గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు వారి సంస్థల పేరుతో ఉన్న రసీదులు సరఫరా చేసేవి. అయితే, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లకు బ‌దులుగా ఏసుక్రీస్తు బోధ‌న‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహన్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన 2019 వ సంవ‌త్స‌రంలో తిరుమ‌ల బ‌స్సు టిక్కెట్ల వెనుక జెరూస‌లెం ప్ర‌చారం ఉంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన హిందూ సంస్థ‌లు రివ‌ర్స్ కావ‌డంతో వాటిని ఆపేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ట్రాఫిక్ చ‌లాన్ల వెనుక ఏసుక్రీస్తు బోధ‌న‌లు ఉండ‌డం రాజకీయ వివాదానికి దారితీస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • ap police
  • religion
  • vizag

Related News

Gunturu Railway Station

Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుత‌న్న వ్య‌క్తులు.. స్థానికుల్లో ఆందోళన

గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంత‌మంది అనుమాన‌స్పదంగా తిరుగుతుడ‌టం స్థానికుల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దాన

  • Missing Case

    Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

  • Insta Mart

    Healthy Diet Craze : వైజాగ్‌లో ప్రోటీన్ ఆహారానికి పెరిగిన డిమాండ్

  • Murder 1

    Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd