గాంధీ జయంతి రోజున జే టాక్స్..చెత్త పన్నులకు జగన్ శ్రీకారం
చెత్త మీద పన్ను వేయడానికి ఏపీ సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పన్నులను జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక గ్రామాల్లోనూ మురికి కాల్వలు, మరుగుదొడ్లపై పన్నులు వేయడానికి సన్నద్ధం అయింది
- By Hashtag U Published Date - 02:57 PM, Thu - 30 September 21

చెత్త మీద పన్ను వేయడానికి ఏపీ సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పన్నులను జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక గ్రామాల్లోనూ మురికి కాల్వలు, మరుగుదొడ్లపై పన్నులు వేయడానికి సన్నద్ధం అయింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రజల నుంచి పారిశుద్ధ్యం పన్నులు వసూలు చేయడానికి పక్కా ప్రణాళికను రచించింది. సామూహిక మరుగుదొడ్ల నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై టాక్స్ లను వేయబోతుంది. గతంలో మేజర్ పంచాయతీలు వాటికి అవే పన్నులను నిర్ణయించుకునేవి. కానీ, ఇప్పుడు అన్ని పంచాయతీలు అనివార్యంగా పారిశుద్ద్యం పన్నులు చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆయా గ్రామాలకు ముందుగా ట్రై సైకిళ్లు, గార్బేజి వాహనాలు ఇవ్వడం ద్వారా వసూళ్లను మొదలు పెట్టబోతుంది.
ఏపీని క్లీన్ చేసే కార్యక్రమానికి గాంధీ జయంతి రోజు సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. క్లీన్ సిటీ, క్లీన్ విలేజ్, స్వచ్చ్ ఆంధ్రప్రదేశ్ , స్వచ్చ్ భారత్ నినాదాలతో ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణ కోసం 2వేలా 6 వందల గార్బెజ్ వాహనాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. బహిర్భూమి, బహిరంగ యూరినల్స్ లేకుండా చేయడం క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. అందులో భాగంగా ప్రతి ఇంటికి బులుగు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల డస్ట్ బిన్స్ ను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేలా 171 చెత్త నిర్వహణ కేంద్రాలను అదనంగా నెలకొల్పబోతున్నారు. 10వేల జనాభా ఉన్న గ్రామాలకు 14వేల ట్రై సైకిల్స్, 10 వందల ఆటో రిక్షాలను చెత్త సేకరణ కోసం అందచేయబోతున్నారు. చెత్తను నాశనం చేయడానికి పంచాయతీలకు 6వేల 417 మిషన్లను అందిస్తారు. మరుగుదొడ్ల పరిశుభ్రపరచడానికి 10వేలా 731 అత్యధిక పీడనం కలిగిన క్లీనర్స్ ను మేజర్ పంచాయతీలకు ఇస్తారు. దోమ నివారణ కోసం 10వేలా 628 ఫాగింగ్ మిషన్లను పంపిణీ చేస్తారు. మున్సిపాలిటిలో 231 చెత్త నిల్వలకు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 6వేల చెత్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అక్టోబర్ 2న 3వేల 97 ఆటో టైపర్స్, 18 వందల ఆటో రిక్షాలను మున్సిపాలిటీలకు అందిచేస్తారు.
ఇక నుంచి ప్రతి ఇంటికి చెత్త బండి వస్తుంది. ఫాగింగ్ మిషన్ నిర్దేశిత రోజుల్లో దోమల మందును పిచికారి చేస్తుంది. డంపింగ్ యార్డుల్లో మాత్రమే చెత్తను వేయాలి. మూడు రకాలుగా చెత్తను విడదీసి చెత్త నిర్వహకులకు అందచేయాలి.గతంలో మాదిరిగా ఎక్కడ బడితే అక్కడ చెత్తను వేయడానికి వీల్లేదు. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ కోసం భారీ ప్రణాళికను జగన్ రచించారు. అయితే, వీటి నిర్వహణ రూపంలో చెత్త పనులు చెల్లించాల్సి ఉంటుంది. సో..ఇక నగరాలు, పట్టణాల్లో మాదిరిగా మీరు గ్రామాల్లో మరుగుదొడ్డికి వెళ్లినా…యూరినల్స్ చేసినా..ఏపీ ప్రభుత్వానికి డబ్బు కట్టాల్సిందేనన్న మాట.
Related News

Ganesha Idols : వినాయక మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి ఆ గ్రామం…కానీ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం
మద్య కాలంలో ఇతరులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారు చేయడంవల్ల తమ మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గిందని వారంతా వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో మట్టి విగ్రహాల తయారుచేసే వారు తమ ఉపాధిని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం