AIMIM vs TDP: ఇప్పుడు ఏపీ ప్రజలు గుర్తుకు వచ్చారా? : టీడీపీ మైనారిటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంఐఎం పార్టీ అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని అధినేత అసదుద్దీన్ స్వయంగా వెల్లడించారు.
- By Praveen Aluthuru Published Date - 01:02 AM, Fri - 29 September 23

AIMIM vs TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంఐఎం పార్టీ అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని అధినేత అసదుద్దీన్ స్వయంగా వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి ఎఐఎంఐఎం పార్టీ పునరాగమనంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎం ఫరూక్ షిబ్లీ స్పందించారు.
ఫరూక్ షిబ్లీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో నువ్వు వచ్చి జగన్ నా స్నేహితుడు అని చెప్పి వెళ్లిపోయావు. మళ్ళీ నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు ఉన్నారని గుర్తుకు వచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్ ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విశ్వసిస్తున్నట్టు ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే చంద్రబాబుని ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అబ్దుల్ సలామ్ కేసు, అతని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఎంఐఎం మౌనంగా ఉందని షిబ్లీ ఎత్తి చూపారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు అందలేదు. మీరు ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికలు సమయంలో ఏపీ ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ ఎద్దేవా చేశారాయన. ముస్లింలకు ఎంఐఎం చరిత్ర తెలుసునని, ప్రజలకు ఎవరు మంచి చేస్తారో, ఎవరేంటో వారు గమనిస్తున్నారని అన్నారు.
Also Read: Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
Related News

CM Jagan : 11 నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చిన జగన్..
వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 నియోజకవర్గాల ఇంచార్జ్ (Incharge of Constituencies) లను మార్చారు. ఏపీ(AP) లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో గెలుపు ఫై మరింత ఫోకస్ చేసారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాల టాప్ గా ఉండబోతున్నాయి. రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర […]