HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Mega Dsc 2024 Notification Date Announced

AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ తేదీ ఖరారైంది..

  • Author : Vamsi Chowdary Korata Date : 09-10-2024 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Mega Dsc 2024
Ap Mega Dsc 2024

AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ తొలి వారంలో విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబర్ 3న ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షల ఫలితాలను నవంబర్ 2న ప్రకటించనున్నట్లు తెలిసింది. టెట్ ఫలితాలు ప్రకటించిన తరువాతి రోజే మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం తక్కువ కాలంలో డిఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటించాలని భావించినా, ఎక్కువ మంది అభ్యర్థులకు టెట్ అర్హత కల్పించడంలో భాగంగా మొదట టెట్ పరీక్షలను నిర్వహించనుంది. ప్రస్తుతం టెట్ 2024 పరీక్షలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీ ప్రక్రియలో ఎలాంటి న్యాయ వివాదాలకు తావు ఇవ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. టెట్ మరియు మెగా డిఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుండి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో, విద్యార్థులు మరియు యువజన సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు వదిలి పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటనలో నాలుగు నెలల వాయిదా ఉంటే, అభ్యర్థులకు భారంగా మారవచ్చని భావించారు. అందువల్ల, నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు.

డిఎస్సీ సిలబస్ లో ఎటువంటి మార్పు లేదు:

డిఎస్సీ 2024 సిలబస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిష్కర్షించింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in లింక్‌లో అందుబాటులో ఉంచామని స్పష్టంగా తెలిపారు. మెగా డిఎస్సీలో కొన్ని జిల్లాలలో కొన్ని విభాగాలకు తక్కువ పోస్టులు వచ్చాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. ఈ విషయాన్ని లోకేష్ అధికారులకు తెలియజేస్తూ వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు.

అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ. 117 వల్ల స్కూళ్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి నష్టం కలిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వంలోకి రావడంతో టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. మెగా డిఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ కూడా కసరత్తు ప్రారంభించింది మరియు ఇందులో కీలక ప్రకటనలు చేసింది.

పోస్టుల వివరాలు:

కొత్తగా విడుదల కానున్న నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ): 6,371
  • స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ): 7,725
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ): 1,781
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 286
  • ప్రిన్సిపాళ్లు: 52
  • వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ): 132

కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది:

గత వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులలో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) మరియు 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబడింది, కానీ టెట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ప్రభావంతో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిస్థితి కూడా మారిపోయింది. కొత్త ప్రభుత్వం ఇప్పుడు మెగా డీఎస్సీ విడుదలకు పునాది వేస్తోంది.

ప్రక్రియ పూర్తికి గడువు:

విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత డీఎస్సీ ప్రకటనను ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలని కోరిన వారికి అవకాశం కల్పించబడుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపు పూర్తి చేయాలని లక్ష్యం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP DSC
  • AP DSC 2024
  • AP DSC Notification
  • AP Mega DSC
  • nara lokesh

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd