AP Inter Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు!
2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి డా. నారాయణ భరత్ గుప్తా ఒక ప్రకటనలో వెల్లడించారు.
- By Gopichand Published Date - 08:47 PM, Fri - 3 October 25

AP Inter Schedule: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఇంటర్‌మీడియట్ పరీక్షల షెడ్యూల్ (AP Inter Schedule)ను ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి డా. నారాయణ భరత్ గుప్తా ఒక ప్రకటనలో వెల్లడించారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతాయి.
ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్
వార్షిక పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
- జనరల్ కోర్సులకు: ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి.
- ఒకేషనల్ కోర్సులకు: ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.
- ప్రాక్టికల్ పరీక్షల సెషన్ల సమయాలు ఈ విధంగా ఉన్నాయి.
- మొదటి సెషన్ (ఉదయం): ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
- రెండో సెషన్ (మధ్యాహ్నం): మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
- ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారాల్లో (Sundays) కూడా నిర్వహించబడతాయి.
Also Read: Sleep Deprivation Heart Risk: మీరు సక్రమంగా నిద్ర పోవటంలేదా? అయితే గుండెపోటుకు దగ్గరగా ఉన్నట్లే!
తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే
ఇంటర్ బోర్డు కార్యదర్శి డా. నారాయణ భరత్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది తాత్కాలిక షెడ్యూల్ (Tentative Schedule) మాత్రమేనని స్పష్టం చేశారు. పండుగల్లో వచ్చే సెలవుల దృష్ట్యా, అవసరమైతే ఈ తుది షెడ్యూల్‌లో కొన్ని స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పరీక్షల తేదీల కోసం విద్యార్థులు తుది ప్రకటనను అనుసరించాలని బోర్డు సూచించింది.