Good News : రెండు గుడ్ న్యూస్‌లు.. ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కారు కానుక
Good News : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందు ఏపీలోని వైఎస్సార్ సీపీ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
- By Pasha Published Date - 03:45 PM, Sun - 17 March 24

Good News : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందు ఏపీలోని వైఎస్సార్ సీపీ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రత్యేకించి మహిళలు, ఉద్యోగుల సంక్షేమాన్ని ఉద్దేశించినవి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. పిల్లల సంరక్షణ సెలవులు (ఛైల్డ్ కేర్ లీవ్స్)కు సంబంధించి ఇచ్చే సెలవులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఛైల్డ్ కేర్ లీవ్స్‌కు సంబంధించి గతంలో విధించిన గడువును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేలోగా మహిళా ఉద్యోగులు ఈ సెలవులను వాడుకోవాలని గతంలో నిబంధనలు ఉండేవి. కానీ ఏపీ ప్రభుత్వం ఈ గడువును తాజాగా తీసేసింది. దీంతో ఉద్యోగ విరమణలోగా మహిళా ఉద్యోగులు ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకునేందుకు లైన్ క్లియర్ అయింది.
We’re now on WhatsApp. Click to Join
సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
ఇక ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైనా శనివారమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెక్రటేరియట్ ఉద్యోగులకు అమరావతిలోని పిచ్చుకలపాలెం పరిధిలో స్థలాలను కేటాయిస్తున్నట్లుగా ఏపీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో జారీ చేశారు. 2019లో గవర్నమెంట్ ఉద్యోగులకు అమరావతిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని రూల్స్ ప్రకారమే.. ఇప్పుడు కూడా స్థలాల విస్తీర్ణం, ధర ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- అంతకుముందు శుక్రవారం రోజు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు డీఏలను మంజూరు చేసింది.
- మున్సిపల్ కార్మికులపై సమ్మెకాలంలో నమోదైన కేసులను ఎత్తివేసింది.
- అంగన్వాడీ కార్యకర్తలకు సమ్మెకాలానికిగానూ వేతనాలను మంజూరు చేయాలని ఆదేశించింది.