Karthikeya 3 : ‘ కార్తికేయ 3 ‘ ను ఖాయం చేసిన నిఖిల్
ఈ ప్రాజెక్ట్‌పై నిఖిల్ సిద్దార్థ ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ.. సరికొత్త సాహసాన్ని వెతికే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు
- By Sudheer Published Date - 03:41 PM, Sun - 17 March 24
కార్తికేయ 3 (Karthikeya 2)ఫై అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో సంతోషం నింపారు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil). హ్యాపీ డేస్ మూవీ తో యూత్ ను ఆకట్టుకున్న నిఖిల్..ఆ తర్వాత అందరి హీరోల్లా కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానులకు , ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ సక్సెస్ అందుకుంటూ వస్తున్నారు. నిఖిల్ నటించిన చిత్రాల్లో కార్తికేయ సిరీస్ ఒకటి.
డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఉత్కంఠభరిత చిత్రం కార్తికేయ. ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్ క్యాంప్ మీద వచ్చిన వైద్య విద్యార్థి కార్తీక్ (నిఖిల్). ప్రతి యేటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరజిమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏమిటి? ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు? ఆ రహస్యం ఛేధించడానికి చేసే ప్రయత్నంలో కార్తీక్‌కి ఏమవుతుంది అన్నదే అసలు కథ. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
2022 లో కార్తికేయ కు కొనసాగింపుగా కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకృష్ణడి కథ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దాదాపు ఈ మూవీ రూ.100 కోట్లు సాధించి నిఖిల్ కెరియర్ లో ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా వచ్చిన రెండు ఏండ్ల తర్వాత నిఖిల్, చందుల కాంబో రిపీట్ కాబోతుంది. తాజాగా కార్తికేయ 3కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్‌పై నిఖిల్ సిద్దార్థ ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ.. సరికొత్త సాహసాన్ని వెతికే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం అంటూ నిఖిల్ రాసుకోచ్చాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతుండగా.. ‘కార్తికేయ 2’తో పోలిస్తే ఇది భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు టాక్.
ప్రస్తుతం నిఖిల్.. పాన్ ఇండియా చిత్రం స్వయంభు (Swayambhu) చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ భామ సంయుక్తామీనన్ (Samyuktha Menon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
Dr. Karthikeya In Search of a Brand new Adventure … Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024
Read Also : Kalki 2898AD: ఎన్నికల కారణంగా ప్రభాస్ మూవీ వాయిదా పడనుందా.. ఫాన్స్ కి నిరాశ తప్పదా?
Related News
Nikhil Siddhartha : జనసేన జెండా పట్టిన హీరో నిఖిల్.. వీడియో వైరల్..
జనసేన జెండా పట్టి జనసైనికులను ఉత్సాహపరిచిన హీరో నిఖిల్. వైరల్ అవుతున్న వీడియో.