HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Spouse Pensions Disabled Verification

Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్‌లు

Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్‌ (Spouse) పింఛన్‌లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • Author : Kavya Krishna Date : 29-07-2025 - 9:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Gov Logo
Ap Gov Logo

Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్‌ (Spouse) పింఛన్‌లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 1,09,155 మందికి నెలకు రూ.4,000 చొప్పున పింఛన్‌లు ఆగస్టు 1 నుంచి అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. పింఛన్ తీసుకుంటూ భర్త మరణించిన సందర్భంలో, భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద వెంటనే పింఛన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త పింఛన్‌ల కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.43.66 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది.

Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!

2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య భర్తలు మరణించిన కుటుంబాల మహిళలు, అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. భర్త పింఛన్ ఐడీ, మరణ ధ్రువపత్రం సమర్పించిన అర్హులను జాబితాలో చేర్చారు. మొదటగా ఈ పింఛన్‌లు జూన్ 12న (ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా) ఇవ్వాలని భావించారు. కానీ వాయిదా పడటంతో, ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇక మరోవైపు, దివ్యాంగుల పింఛన్‌లపై ఏపీ ప్రభుత్వం సమగ్ర తనిఖీలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అనర్హులు లక్ష మందికి పైగా పింఛన్‌లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7.86 లక్షల దివ్యాంగులు పింఛన్‌లు పొందుతున్నారు. కొందరు నెలకు రూ.6 వేల వరకు పింఛన్ పొందుతున్నప్పటికీ, వాస్తవానికి వైకల్యం లేని వారు తప్పుడు ధ్రువపత్రాలు తీసుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.

మానసిక సమస్యలు, వినికిడి లోపం వంటి నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించి పింఛన్ పొందిన వారిని గుర్తించేందుకు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో కూడా అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల కోటాలో రూ.6 వేల, రూ.10 వేల, రూ.15 వేల వరకు పింఛన్‌లు పొందిన వారిలో అనర్హులు ఉన్నట్లు తేలింది. త్వరలో ఈ జాబితాపై అధికారిక క్లారిటీ ఇచ్చి, అనర్హుల పింఛన్‌లు రద్దు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తూనే, అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Govt Teacher : రూ.70 వేల జీతం తీసుకునే సర్కార్ టీచర్ కు ‘ELEVEN’ స్పెల్లింగ్ రావట్లే..ఏంటి సర్ ఇది !!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP government
  • Disabled Pensions
  • Kondapalli Srinivas
  • NTR Bharosa
  • Pension Verification
  • Spouse Pension
  • welfare schemes

Related News

Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్‌తో కీలక చర్చలు జరిపారు. మాస్కోలో స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో భేటీ అయిన లోకేష్, భారత్‌లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ముఖ్

  • Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

    Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

    South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd