Montha Cyclone : ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ సర్కార్
Montha Cyclone : ప్రజలు రోజువారీగా అవసరమయ్యే ప్రధాన సరుకులను ప్రతి కుటుంబానికి అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1 లీటర్ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేయనున్నారు
- Author : Sudheer
Date : 29-10-2025 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొంథా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తోంది. తుపాన్ కారణంగా తీరప్రాంతాలలో రోజువారీ జీవనం తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్, త్రాగునీరు, రవాణా వ్యవస్థలు దెబ్బతినడంతో పాటు అనేక కుటుంబాలు తమకు కావాల్సిన నిత్యావసరాలను కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, ప్రభావిత ప్రాంతాల్లో ఉపశమన చర్యలు చేపట్టింది.
Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రజలు రోజువారీగా అవసరమయ్యే ప్రధాన సరుకులను ప్రతి కుటుంబానికి అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1 లీటర్ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేయనున్నారు. సముద్రంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల చేపల వేటకు వెళ్లలేని మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యేక రాయితీగా 50 కిలోల బియ్యం ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరాను ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అందించింది.
Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది
అలాగే ఉల్లిపాయలు, బంగాళాదుంపల పంపిణీ కోసం మార్కెటింగ్ కమిషనర్‌కు తగు చర్యలు చేపట్టాలని సూచించింది. తుపాన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు తక్షణ ఉపశమనంతో పాటు పునరావాస చర్యలు కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా, ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం చేస్తున్న సహాయాలు, ప్రజలను ధైర్యంగా ముందుకు సాగేందుకు దోహదపడుతున్నాయి.