Cyclone Michaung : దూసుకు వస్తున్న మిచౌంగ్ తుపాను.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
మిచౌంగ్ తుపాను దూసుకువస్తుంది. ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే
- Author : Prasad
Date : 04-12-2023 - 7:53 IST
Published By : Hashtagu Telugu Desk
మిచౌంగ్ తుపాను దూసుకువస్తుంది. ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి సాయంత్రం వరకు గాలులు కుడా వీచే అవకాశం ఉందని తెలిపింది. తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి.కానీ అసలైన వర్షాలు కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, రేపల్లె, విజయవాడ, ఏలూరు, గుడివాడ, బీమవరం, మచిలీపట్నం, జంగారెడ్డిగూడెం, కాకినాడ, తుని, యానాం విశాఖపట్నం, విజయనగరం, మొత్తం జిల్లా లోని అన్నీ భాగాల్లో కి వర్షాలు విస్తరిస్తాయి. భారీ వర్షాలు అనేవి ఈరోజు,రేపు నమోదవుతాయి. గాలులు గంటకి 65-70కిలోమీటర్లు వేగం తో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఏపీ అధికారులు అప్రమత్తమైయ్యారు. సముద్రంలోకి జాలర్లు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు మందులు,అవసరమైన వాటిని తీసుకెళ్లారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణశాఖ సిద్దమైంది.
Also Read: Priyanka Gandhi: ఇబ్బంది పెట్టిన వాళ్లకు అభినందనలు : ప్రియాంక గాంధీ