HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Etikoppaka Bommalu Shines At Republic Day Celebrations

Republic Day Parade : ఆకట్టుకున్న ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం

Republic Day Parade : ఈ ప్రదర్శన ద్వారా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, గ్రామీణ కళల విలువలను తెలుసుకునే అవకాశం కలిగింది

  • Author : Sudheer Date : 26-01-2025 - 8:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Etikoppaka Bommalu Shines
Etikoppaka Bommalu Shines

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ (Republic Day Parade) వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం (Etikoppaka Bommalu Shines) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం పర్యావరణ హితంగా తయారు చేసిన ఏటికొప్పాక బొమ్మల అందాన్ని, ప్రతిష్టను ప్రతిబింబించింది. స్థానికంగా లభించే చెక్కతో, ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా తయారైన ఈ బొమ్మలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ పరేడులో మొత్తం 26 శకటాలను ప్రదర్శించగా.., అందులో 16 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, 10 కేంద్ర ప్రభుత్వ సంస్థల శకటాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కాయి.

Vijaysai Reddy Plan : వ్యవసాయం కాదు.. విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?

ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల శకటం (Etikoppaka Dolls) ప్రదర్శన అందర్నీ కట్టిపడేసింది. విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఈ బొమ్మలు 400 ఏళ్ల చరిత్రను కలిగి ఉంటాయి. ప్రత్యేకంగా అంకుడు కర్రతో చేతితో తయారు చేయబడే ఈ బొమ్మలు తమ నాణ్యత మరియు కళాత్మకతకు ప్రసిద్ధి పొందాయి. ఏటికొప్పాక బొమ్మలు 2017లో భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందడం ఈ కళకు గ్లోబల్ గుర్తింపునిచ్చింది. ఈ బొమ్మలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైన పద్ధతుల్లో తయారు చేయబడతాయి. రసాయనాల వాడకం లేకుండా, సహజంగా లభించే వర్ణాలతో ఈ బొమ్మలు తయారు చేయబడటం వాటి ప్రత్యేకత.

గణతంత్ర పరేడులో ఈ శకటానికి స్థానం దక్కడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సంప్రదాయ కళకు, హస్తకళలకు ఒక అంతర్జాతీయ వేదిక లభించింది. పరేడ్‌లో ప్రదర్శించిన శకటంలో ఏటికొప్పాక బొమ్మల తయారీ విధానం, వాటి వినియోగంపై వివరాలు అందించారు. ఈ బొమ్మలు పిల్లల ఆట బొమ్మలుగా మాత్రమే కాకుండా, ఇంటీరియర్ డెకరేషన్‌లోనూ విరివిగా ఉపయోగించబడుతున్నాయి. ఇలాంటి పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల ప్రాచుర్యానికి ఇది గొప్ప వేదికగా మారింది.

All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?

ఈ ప్రదర్శన ద్వారా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, గ్రామీణ కళల విలువలను తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రతి సంవత్సరం పరేడ్‌లో రాష్ట్రాల ప్రత్యేకతలను చూపించే శకటాలు గర్వకారణంగా నిలుస్తాయి. ఈసారి ఏటికొప్పాక బొమ్మల శకటం ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టను పెంచింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘బొమ్మలమ్మ.. బొమ్మలు’ అంటూ సాగే పాటతో ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో సాగిన శకటాల పరంపరలో ప్రత్యేక ఆకర్షణగా మన ఏటికొప్పాక బొమ్మల కొలువు నిలిచిందని తెలిపారు. మన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాని నరేంద్రమోడితో సహా ప్రముఖులందరిని ఆకట్టుకున్నదని తెలిపారు. దీనికి కారణభూతులైన వారందరిని చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం దేశ ప్రజలు అందరి దృష్టినీ ఆకర్షించింది. స్థానికంగా లభించే చెక్కతో, ఎటువంటి రసాయనాలు వాడకుండా పర్యావరణహితమైన ఏటికొప్పాక బొమ్మలు గణతంత్ర దినోత్సవం రోజున ఘనమైన ప్రదర్శనగా నిలిచింది.#EtikoppakaToys… pic.twitter.com/AN66ccqpjX

— Telugu Desam Party (@JaiTDP) January 26, 2025

76వ గణతంత్ర వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాతమైన మన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాని నరేంద్రమోదీ గారితో సహా ప్రముఖులందరిని ఆకట్టుకున్నది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ‘బొమ్మలమ్మ… బొమ్మలు’ అంటూ… pic.twitter.com/YDi5heo9Gv

— N Chandrababu Naidu (@ncbn) January 26, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Etikoppaka Bommalu Shines
  • Republic Day Celebrations

Related News

Bill Gates 

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • IND vs NAM

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

Latest News

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

Trending News

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd