HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Collector Has A Great Mind One Acre Of Land For Free

Settipally Ramasundhar Reddy : ఏపీ కలెక్టర్ గొప్ప మనసు.. ఉచితంగా ఎకరం స్థలం.!

  • Author : Vamsi Chowdary Korata Date : 27-10-2025 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Settipalli Rama Sundhar Red
Settipalli Rama Sundhar Red

వ్యవసాయ కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి అనుకున్నది సాధించి ఉన్నత స్థితిలో ఉన్నారు విజయనరగం జిల్లా కలెక్టర్ రాంసుంద్ రెడ్డి. అడ్డంకులను దాటుకుని ముందు గ్రూప్ 1 ఆ తర్వాత ఐఏఎస్ అయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, సివిల్స్ లో విఫలమైనా, పట్టుదలతో గ్రూప్-1 సాధించి, చివరకు ఐఏఎస్ అయ్యారు. తన సొంత ఊరి కోసం ఆస్పత్రి కట్టించి, గాంధీ మార్గంలో నడుస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

తండ్రి కష్టాల చూస్తూ పెరిగారు.. జీవితంలో ఎలాగైనా ఉన్నతస్థాయికి వెళ్లాలని లక్ష్యంగా కష్టపడ్డారు. చివరికి అనుకున్నది సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనే విజయనగరం జిల్లా కలెక్టర్ శెట్టిపల్లి రాంసుందర్ రెడ్డి . కడప జిల్లా నక్కలదిన్నెకు చెందిన రాంసుందర్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం. తండ్రి జయరాంరెడ్డి, అమ్మ కాంతమ్మ.. నలుగురు అక్కల తర్వాత రాంసుందర్ రెడ్డి జన్మించారు. ఆయన మదనపల్లి హార్సిలీ హిల్స్‌లో ఉన్న స్కూల్‌లో విద్దను అభ్యసించారు. అనంతరం ఇంటర్‌ అనంతపురంలో.. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. తండ్రి జయరాంరెడ్డి కష్టపడి చదవించారు.

వయసు చాల్లేదని ఉన్నత చదువులకు వెళ్లలేకపోయారు. సివిల్స్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.. చివరికి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగాన్ని సాధించారు.. 8 ఏళ్ల తర్వాత ఐఏఎస్ అయ్యారు. రాంసుందర్ రెడ్డికి దగ్గరి బంధువైన ప్రస్నతో వివాహంకాగా.. ఇద్దరు పిల్లలు, కుమార్తె డిగ్రీ బీబీఏ చదువుతున్నారు. కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. ఈ ప్రపంచంలో క్రమశిక్షణ, ఏకాగ్రతతో ముందుకెళితే సాధించలేనిది ఏదీ లేదన్నారు రాంసుందర్ రెడ్డి. నిజాం కాలేజీలో చేరడంతో జీవితం మలుపు తిరిగిందన్నారు. సివిల్స్ రాసినా విజయం సాధించలేదని.. ఆ తర్వాత నెలకు రూ.20వేల జీతంతో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.9 వేల చొప్పున సేవింగ్స్ చేశారు.

రాంసుందర్ రెడ్డి అలా ఉద్యోగం చేస్తూనే పోటీపరీక్షల కోసం చదివారు. తండ్రిపై ఆధార పడకూడదని ఉద్యోగం చేశారు.. 2007లో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికై ఆర్డీవోగా ఉద్యోగంలో చేరారు. ఆయన ఉద్యోగం చేస్తూనే నిజాం కాలేజీ, చిక్కడపల్లిలో ఉన్న లైబ్రరీలను పోటీ పరీక్షలకు ఉపయోగించుకున్నారు. చిక్కడపల్లి ల్రైబరీలో ఉద్యోగి పుల్లయ్య తనకు సాయం చేశారని.. ప్రోత్సహించారన్నారు. ఆయన్ను కలిసేందుకు వెళితే ఆయను చనిపోయినట్లు తెలిసి బాధపడ్డానన్నారు. 2016లో తన తండ్రి మరణంతో తన బాధ వర్ణనాతీతం అన్నారు.

‘మా సొంత ఊరిలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. ఎలాగైనా సరే వారందరికి కోసం ఆస్పత్రి నిర్మించాలి అనుకున్నాను. అందుకే సొంత ఊరి కోసం ఎకరా స్థలాన్ని రాసించ్చాను. అక్కడ కేంద్రం విడుదల చేసిన రూ.3కోట్లతో ఆస్పత్రి భవనం పూర్తి చేశారు. ఇప్పుడు స్థానిక ప్రజలకు సేవలు అందుతున్నాయి. నాకు గాంధీ అంటే ఇష్టం.. ఆయన మార్గంలోనే ముందుకు సాగుతున్నాను. ఏడాదికి ఒకసారి భద్రాచలం వెళ్లి శ్రీరాముడ్ని దర్శించుకుంటాను.. నాకు నేను చదివిన హార్సిలీహిల్స్‌ స్కూల్ అంటే చాలా ఇష్టం, నచ్చిన పర్యాటక ప్రాంతం కూడా.. బుక్స్ చదవడం బాగా అలవాటు’ అని వివరించారు విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap collectors
  • Settipally Ramasundhar Reddy

Related News

    Latest News

    • Tamanna : వామ్మో తమన్నా కూడా తోపే ..ఎలా అంటారా ?

    • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

    • Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు

    • CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

    • నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్..ఆరేళ్ల తర్వాత హ్యాపీ

    Trending News

      • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

      • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

      • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

      • బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd