AP CM : సీఎం సభలో కర్చీఫ్‌లు, పెన్నులే వారి ఆయుధాలు.. బీకేర్ ఫుల్
విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పలువురు ఉపాధ్యాయులకు సీఎం జగన్
- By Prasad Published Date - 12:59 PM, Mon - 5 September 22

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పలువురు ఉపాధ్యాయులకు సీఎం జగన్ ఉత్తమ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారు ఆనందంగా అవార్డును అందుకొని కిందకు వచ్చారు. కుర్చీల్లో ఆశీలైన ఉపాధ్యాయులు చపట్లు కొట్టారు. ఇదంతా నాలుగు గోడల మధ్య 25 డిగ్రీల చల్లటిగాలి మధ్య జరిగిన కార్యక్రమం ఇది. కానీ ఈ కార్యక్రమానికి ముందు మాత్రం పోలీసులు ఓ చిన్న సైజు యుద్ధాన్ని నిర్వహించారు. సీఎం గారు వస్తున్నారు ఉపాధ్యాయులు వద్ద ఆయుధాలు ఉన్నాయి ఏమో అని వందల మంది పోలీసుల పహారా మధ్య.. పై నుంచి కింది వరకు అనువణువు చెక్ చేశారు. ఇక్కడ మీకో డౌట్ రావొచ్చు ఉపాధ్యాయుల వద్ద మారణాయులు ఎందుకు ఉంటాయన.. సీపీఎస్ రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై టీచర్లు ఒత్తిడి తీసుకువస్తున్నారు. కొన్ని చోట్ల నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.
ఇన్ని ఆందోళనల మధ్య ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం అంటే కత్తిమీద సాములాంటిందే. ఇందాక చెప్పినట్లు ఉపాధ్యాయుల వద్ద ఉన్న ఆయుధాలేంటి అనుకుంటున్నారా..? కర్చీఫ్, పెన్నులు. సీఎం జగన్ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయుల వద్ద ఉన్న కర్చీఫ్‌లను, పెన్నులను భద్రతా సిబ్బంది ముందుగానే తీసేసుకున్నారు. ఎందుకంటే సభలో ఆకస్మికంగా ఎవరైనా కర్చీఫ్‌లతో నిరసన వ్యక్తం చేస్తే పరువుపోతుందని ముందుగానే వారి వద్ద నుంచి లాగేసుకున్నారు. అలాగే అక్కడ చిన్న పేపర్ ముక్క దొరికినా చాలు ఉపాధ్యాయులు పెన్నుతో వినతి పత్రాలు అందిస్తారని పెన్నులు కూడా లాగేసుకున్నారు. చివరకు సీఎం సభ అయిపోయే వరకు ఎవరి వద్ద కర్చీఫ్ కనబడిన అది పిస్టల్‌లాగా, పెన్ను కనిపిస్తే గ్రైనేడ్‌లాగా భావించారు పోలీసులు. ముఖ్యమంత్రి జగన్ సభ పూర్తైన తర్వాత కర్చీఫ్‌లను ఉపాధ్యాయులకు పోలీసులకు ఇవ్వబోతుంటే.. ఛీ ఛీ మాకొద్దు అంటూ టీచర్లు పెదవి విరుచుకుంటూ వెళ్లిపోయారు.
Tags
- Andhra Pradesh Contributory Pension Scheme (APCPS)
- Andhrapradesh
- AP CM Jagan
- teachers day
- teachers union

Related News

Jagan CPS : జగన్ కు ఆర్బీఐ బాసట, ఉద్యోగులకు OPS, CPS రెండూ లేనట్టే!
పాత పెన్షన్ అమలు రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళతాయని ఆర్బీఐ చేసిన హెచ్చరిక