HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Mohan Reddy Cooments On Guntur Issue

AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి

గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

  • Author : Prasad Date : 02-01-2023 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Jagan
Babu Jagan

గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించి వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాత కిట్‌ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్ కూలడంతో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆసుపత్రిని సందర్శించిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌హిళల మృతికి కార‌ణం చంద్ర‌బాబేన‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు పబ్లిసిటీ ట్రిక్స్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో టీడీపీ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారని విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. డిసెంబరు 28న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్ర‌బాబు రోడ్‌షో సందర్భంగా ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. పబ్లిసిటీ పట్ల ఆయనకున్న మోజు మనుషుల ప్రాణాలను బలిగొందని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని చూపించేందుకు చంద్ర‌బాబు నాయుడు ఇరుకు సందుల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • gunturu
  • tdp
  • ycp

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd