HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Chandrababu Naidu Letter To Union Minister Piyush Goyal

CM Chandrababu: యూఎస్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు చంద్ర‌బాబు లేఖ‌

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు.

  • Author : News Desk Date : 06-04-2025 - 10:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Naidu
Chandrababu Naidu

CM Chandrababu: కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌ల ప‌లు దేశాల‌పై ప్ర‌తీకార సుంకాలు విధించిన విష‌యం తెలిసిందే. భార‌త‌దేశం నుంచి అమెరికాకు ఉత్ప‌త్తి అయ్యే దిగుమ‌తుల‌పై 27శాతం సంకాల‌ను విధిస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. ట్రంప్ నిర్ణ‌యం ప‌ట్ల ఆక్వా ఉత్ప‌త్తుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. భార‌త్ నుంచి ఇత‌ర‌ దేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న మాంస ఉత్ప‌త్తుల్లో రొయ్య‌ల‌ది మూడో స్థానం. ఏపీలోని ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచే సింహ‌భాగం ఆక్వా ఉత్ప‌త్తులు ఎగుమ‌తి అవుతున్నాయి. ట్రంప్ నిర్ణ‌యంతో రొయ్య‌ల సాగు దారుల‌కు న‌ష్టాలు వాటిల్లే ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజాగా విష‌యంపై వివ‌రిస్తూ కేంద్ర మంత్రికి సీఎం చంద్ర‌బాబు లేఖ రాశారు.

Also Read: PM Modi: డీఎంకే ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని మోదీ ప‌రోక్ష విమ‌ర్శ‌లు.. సంత‌క‌మైనా త‌మిళంలో చేయండంటూ..

భారతదేశం నుంచి వెళ్లే సముద్రపు ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతోంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది అమెరికా. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ.. వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటోంద‌ని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు.

Also Read: BRS Silver Jubilee: బీఆర్ఎస్‌కు మరో షాక్.. రజతోత్సవ సభకు అనుమతి డౌటే ?

సుంకాల నుంచి ఆక్వా ఉత్ప‌త్తులు మిన‌హాయింపు పొందేలా యూఎస్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని చంద్ర‌బాబు లేఖ‌లో కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ జీడీపీలో మ‌త్స్య‌రంగం కీల‌కంగా ఉంద‌న్న చంద్ర‌బాబు.. సంక్షోభ స‌మ‌యంలో ఆక్వా రైతుల‌కు అండ‌గా ఉండాల‌ని కోరారు. అధిక సుంకాల వ‌ల్ల మ‌న ఆర్డ‌ర్ల‌ను ఇత‌ర దేశాలు ర‌ద్దు చేసుకుంటాయ‌ని, ఏపీ శీత‌ల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థ‌లం లేద‌ని, ఆక్వా రైతులు గంద‌ర‌గోళంగా ఉన్నార‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మ‌రోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉంది. 27శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు ఎదురయ్యాయి. సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నా. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు అంటూ లేఖ రాశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aqua sector
  • chandrababu naidu
  • Donald Trump
  • Retaliatory tariffs
  • Union Minister Piyush Goyal

Related News

Meloni fires at Trump

Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

ఇటీవల జరిగిన G7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫోటో దిగడం కోసం బతిమలాడుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని మెలోని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ చేసిన కామెంట్లు పూర్తిగా కల్పితమని, వాటిలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల్లోని శత్రువుల పట్ల ట్రంప్ చూపించే గ

  • Trump's warning to Iran

    Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • Trump makes a sensational move at the G7 summit!

    G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

  • $100,000 fee for H-1B again

    H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు

  • US-Iran peace deal reached... Oil prices crash.

    కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd