Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
- By hashtagu Published Date - 08:22 AM, Wed - 16 November 22
మరో 30ఏళ్లు ఏపీలో అధికారం మనదే అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్లు మన పార్టీయే పాలిస్తుందన్నారు. మంగళవారం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సారి గెలుస్తే… మన పార్టీమరో 30ఏళ్లు ఏపీ లో అధికారంలో ఉంటుందన్నారు. చంద్రబాబు కేవలం బీసీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారన్న జగన్… ప్రస్తుతం మన ప్రభుత్వం బీసీ అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. వైసీపీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని…ఈ విధంగా ప్రజలకు మన పథకాల గురించి ప్రచారం చేస్తే… మనం సులభంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు జగన్.