AP Capital : అమరావతి వెలుగుతోంది.! రైల్వే లైన్ షురూ!
అమరావతిని (AP Capital) ఎవరూ చంపలేరు. దాని నిర్మాణం మందికొడిగా సాగుతోందంతే.
- By CS Rao Published Date - 01:20 PM, Fri - 10 March 23

అమరావతిని (AP Capital) ఎవరూ చంపలేరు. దాని నిర్మాణం మందికొడిగా సాగుతోందంతే. తాజాగా రైల్వే ప్రాజెక్టు (Railway project) తెరమీదకు వచ్చింది. దాన్ని పట్టాలు ఎక్కించడానికి విజయవాడ రైల్వే అధికారులు ముందుకొచ్చారు. ప్రత్యేక రైల్వే లైన్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేయడానికి ఆనాడు చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ప్రత్యామ్నాయంగా అమరావతి రైల్వే ప్రాజెక్టును సొంతంగా చేపట్టాలని విజయవాడ రైల్వే అధికారులు యోచిస్తున్నారు.
అమరావతి రైల్వే ప్రాజెక్టు (AP Capital)
అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఈ ప్రాజెక్టు ప్రతిపాదన కేంద్ర రైల్వే శాఖకు (Railway prject)అందచేసింది. విజయవాడ-గుంటూరును అమరావతి మీదుగా అనుసంధానించాలని రూ. 2,800 కోట్ల అంచనాతో ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. అంతేకాదు, 2017-18 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అయితే, ఏపీలో ప్రభుత్వం మారడం, రాజధానిపై(AP Capital) స్పష్టత లేకపోవడం కారణంగా ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా అటకెక్కింది.అమరావతి రైల్వే లైన్( Railway project) కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ ను ప్రతిపాదించారు. దానికి అనుసంధానంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కిలోమీటర్ల సింగిల్ లైన్, కృష్ణా నది మీదుగా 3 కిలోమీటర్ల మేర నూతన బ్రిడ్జి నిర్మాణం వంటివి ఆనాడు చంద్రబాబు సర్కార్ తయారు చేసిన ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ. 2,800 కోట్లు కేటాయించారు. అయితే, ఈ ప్రాజెక్టులోని మిగతా వాటిని పక్కనపెట్టి ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ చేపట్టాలని రైల్వే ఏడీఆర్ఎం డి.శ్రీనివాసరావు వెల్లడించడం గమనార్హం.
Also Read : Jagan Effect : ఉద్యోగుల ఉద్యమం సడలింపు, ధర్నాలు రద్దు
ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని(AP Capital) వీలున్నంత వరకు పక్కనపడేయాలని చూస్తున్నారు. కానీ, చంద్రబాబు సర్కార్ తయారు చేసిన ప్రతిపాదనలు మాత్రం నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాలను కనీస స్థాయిలో కూడా జగన్ అమలు చేయకపోయినప్పటికీ ఒక రూపానికి అమరావతి వస్తోంది. అమరావతి ముఖచిత్రాన్ని టీడీపీ సానుభూతిపరులు తాజాగా వాట్సప్ గ్రూప్ ల్లో పెడుతున్నారు. అక్కడి నిర్మాణాలు ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలియచేస్తూ వివరాలను వైరల్ చేస్తున్నారు. గ్రూప్ ల్లో తిరుగుతోన్న మెసేజ్ లను గమనిస్తే అమరావతి నిర్మాణం నత్తనడకన నడుస్తుందని అర్థం అవుతోంది. పూర్తిగా నిలిచిపోలేదని బోధపడుతోంది. అంతేకాదు, అమరావతిలోని కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేటాయించిన భవనాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటిని చూస్తే అమరావతి ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చంపేయలేరని అర్థమవుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పలుమార్లు చెప్పారు.
చంద్రబాబు డిజైన్ చేసిన మాదిరిగా రూపొదిద్దుకోవడం
ప్రపంచంలోనే టాప్ – 6 బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీలుగా పేర్కొంటు అంతర్జాతీయ మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇటీవల కథనాన్ని ప్రచురించింది. ఆ దిశగా అమరావతి(AP Capital) అడుగులు వేస్తుందనడానికి నిదర్శనంగా ఇప్పుడు రైల్వే ప్రాజెక్టు ముందుకొచ్చింది. అమరావతి రాజధాని ముగిసిపోయిన అధ్యాయంగా వైసీపీ చెబుతోంది. కేంద్రం విడుదల చేసిన కొన్ని నిధులను అమరావతి కోసం అనివార్యంగా ఏపీ సర్కార్ కేటాయించింది. ఆ నిధులతోనే అమరావతి మౌనంగా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు రైల్వే లైన్ (Railway project)కూడా కార్యరూపంలోకి రానుంది. ఫలితంగా అమరావతి ఆనాడు చంద్రబాబు డిజైన్ చేసిన మాదిరిగా రూపొదిద్దుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే, ఆలస్యంగా ఎదుగుతోంది.
Also Read : AP Capital : జగన్ కు మరోసారి `అమరావతి` షాక్, సుప్రీంలో భంగపాటు!

Related News

Jagan MLC : అమ్మో `తాడేపల్లి`..ఇప్పుడెళ్లారో.!
సినిమా రంగాన్ని `బుల్లెట్ దిగిందా? లేదా?`అనే డైలాగ్ ఊపేసింది.