AP Cabinet : ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ..పలు అంశాలపై చర్చ..!
AP Cabinet : జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది..అమరావతి రాజధాని పున: నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- By Latha Suma Published Date - 05:41 PM, Wed - 2 October 24
AP Cabinet: ఏపీలో ఈ నెల 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశంలోనే ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీతో పాటు పీ-4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చెత్తపై విధించిన పన్నును రద్దు చేసే అంశంపై కూడా ఏపీ మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనుంది. అలాగే, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటుగా అమరావతి రాజధాని పున: నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పలుమార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఇందులో మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి పథకాలకు ఆమోదం చెప్పడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
Read Also: Isha Foundation : ఈశా ఫౌండేషన్ లో 150 మంది పోలీసుల సోదాలు