HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Bjp Vacancy Kamineni Another Ex Minister Riding A Bicycle

AP Politics: ఏపీ బీజేపీ ఖాళీ! సైకిల్ ఎక్కనున్న కామినేని, మరో మాజీ మంత్రి?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి.

  • Author : CS Rao Date : 26-02-2023 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kamineni Srinivas
Kamineni Srinivas

AP Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కీలక నేతలకు పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా నేతల జంపింగ్స్ పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది.

అందులో భాగంగా టీడీపీ నెలకో నేత ను పార్టీ లో చేర్చుకుంటూ సంచలనం సృష్టిస్తుంది…డిశంబర్ లో ఆనం..జనవరిలో కోటంరెడ్డి..ఫిబ్రవరిలో కన్నా…మార్చి నెలకు ఇద్దరు నేతలను లైన్లో పెడుతున్నట్లు సమాచారం వీరిలో ఒకరు విష్ణు కుమార్ రాజు కాగా .ఇప్పుడు కాషాయం పార్టీకి చెందిన మరో ముఖ్య నేత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. జనసేన – టీడీపీ పొత్తు వేళ ఈ నేత టీడీపీ ఎంట్రీ ఆసక్తి కరంగా మారుతోంది.

ఏపీ బీజేపీ నుంచి మాజీ మంత్రి టీడీపీలో చేరతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సుదీర్గ రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ త్వరలో సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరటంతో ఇప్పుడు అక్కడ టీడీపీకి బలమైన నేత అవసరం. గతంలో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ 2014లో కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు 2014లో బిజెపిలో చేరి పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించిన ఏపీకి చెందిన ముఖ్య నేత మద్దతుగా సీటు దక్కించుకున్నారు. కామినేనికి అటు జనసేనాని పవన్ ..టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యంలోనూ కామినేని పని చేసారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి జయమంగళం వెంకట రమణ చేతిలో ఓడిపోయారు.

కామినేని 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి పని చేసిన ఇద్దరు మంత్రుల్లో ఒకరిగా ఉన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ – చంద్రబాబు సమావేశాల నిర్వహణలో కీలక భూమిక పోషించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సమయంలో ఏపీలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి బీజేపీలోనే కామినేని కొనసాగుతున్నారు. బీజేపీలో ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నా..ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో దూరం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.అందులో భాగంగా.. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని చెబుతున్నారు. టీడీపీ – జనసేన పొత్తు వేళ రెండు పార్టీల అధినేతలతో సత్సంబంధాలు ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే, బీజేపీతోనూ పొత్తు ఉండాలని టీడీపీ కోరుకుంటోంది. దీంతో..బీజేపీ నేతల చేరిక పైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కన్నా ఎంట్రీతో ఆసక్తి ఉన్న ఇతర నేతలకు లైన్ క్లియర్ అయింది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం పొత్తులు..చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కైకలూరు సీటు వచ్చే ఎన్నికల్లో కామినేనికి కేటాయించేందుకే జయమంగళం వెంకటరమణకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదనే వాదన ఉంది. ఇప్పుడు వెంకట రమణ వైసీపీలో చేరటంతో అక్కడ కామినేని కి రూట్ క్లియర్ అయింది.

ఏపీలో వైసీపీతో మినహా ఇతర పార్టీల నేతలతో కామినేనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా నియోజకవర్గంలోనూ టీడీపీ – జనసేన పొత్తు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో..వ్యూహాత్మకంగానే కామినేని టీడీపీలో చేరటం.. పార్టీ అధినాయకత్వం కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమతో పొత్తుకు అంగీకరించని బీజేపీ కి తన సత్తా ఏంటో చూపించే విధంగా బీజేపీ నేతలు వరుసగా టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్న వేళ..కమలం పార్టీ ఈ పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తుదనేది చూడాలి.

అంతేకాకుండా త్వరలో బీజేపీ మొత్తం ఖాళీ చేసే విధంగా చంద్రబాబు పనిచేస్తున్నట్లు సమాచారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap bjp
  • ap politics
  • Kamineni Srinivas
  • tdp
  • telugu desam party

Related News

Tdp Door To Door Campaign

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం

ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా తన పనితీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది

    Latest News

    • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

    • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

    • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

    • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

    • భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd