AP Assembly : నిరసనలతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం…26 వరకు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ తొలి రోజే పెట్రోలు, డీజిల్ ధరలు, చెత్త పన్ను మీద చంద్రబాబు నిరసన తెలిపాడు. పాదయాత్రగా బ్యానర్ ప్రదర్శిస్తూ ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
- Author : Hashtag U
Date : 18-11-2021 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ తొలి రోజే పెట్రోలు, డీజిల్ ధరలు, చెత్త పన్ను మీద చంద్రబాబు నిరసన తెలిపాడు. పాదయాత్రగా బ్యానర్ ప్రదర్శిస్తూ ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. బీఏసీ సమావేశంలో టీడీపీ కోరిన విధంగా ఆరు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు బుగ్గన, అనిల్, కన్నబాబు హాజరయ్యారు.