HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Any War Link Between Vijayawada And Ukrain 2

Ukraine – Vijayawada: ఉక్రెయిన్ యుద్ధానికి, విజ‌య‌వాడ‌కు లింకేమిటి?

ఉక్రెయిన్ యుద్ధానికి, విజ‌య‌వాడ మార్కెట్‌కు ఏమైనా డైరెక్ట్ లింక్ ఉందా? అక్క‌డ‌ ఎంబీబీఎస్ చ‌దువుతున్న త‌మ పిల్ల‌లు ఎలా ఉన్నారో అన్న ఆందోళ‌న కొంద‌రిలో ఉంటోందే త‌ప్ప‌, మొత్తం మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప‌రిస్థితులు ఇప్ప‌టికైతే క‌నిపించ‌డం లేదు.

  • Author : Hashtag U Date : 27-02-2022 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukraine33
Ukraine33

ఉక్రెయిన్ యుద్ధానికి, విజ‌య‌వాడ మార్కెట్‌కు ఏమైనా డైరెక్ట్ లింక్ ఉందా? అక్క‌డ‌ ఎంబీబీఎస్ చ‌దువుతున్న త‌మ పిల్ల‌లు ఎలా ఉన్నారో అన్న ఆందోళ‌న కొంద‌రిలో ఉంటోందే త‌ప్ప‌, మొత్తం మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప‌రిస్థితులు ఇప్ప‌టికైతే క‌నిపించ‌డం లేదు. అయినా అలాంటి లింకును కొందరు వ్యాపారులు సృష్టిస్తున్నారు.

విజయవాడ మార్కెట్‌లో వంట నూనెల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్‌లో షేర్ల మాదిరిగా ఉద‌యం ఒక రేటు, సాయంత్రానికి మ‌రో రేటు ప‌లికింది.

ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొనే స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ రేటు పెరిగిందంటే స‌రేలే అని స‌రిపెట్టుకోవ‌చ్చు. దానితో సంబంధం లేని పామాయిల్‌, దేశంలోనే దొరికే వేరుసెన‌గ నూనె ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి.
ఇదేమ‌ని అడిగితే ఉక్రెయిన్ యుద్ధ‌మ‌ని స‌మాధానం చెబుతున్నారు. హోల్‌సేల్ వారు పెంచారు కాబ‌ట్టి, తామూ పెంచ‌క‌త‌ప్ప‌లేద‌ని రిటెయిల‌ర్లు అంటున్నారు.

ఉక్రెయిన్‌లో అలా యుద్ధం ప్రారంభ‌యిందో లేదో విజ‌య‌వాడ‌లోని ఓ మాల్‌లో పామాయిల్ ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు లీట‌రు రేటు రూ.128 ఉండ‌గా, 12 గంట‌ల‌కు రూ.149 ప‌లికింది. కేవ‌లం రెండు గంటల్లోనే రూ.21 పెరిగింది. పామాయిల్ మ‌లేషియా నుంచి దిగుమ‌తి అవుతుంది. యుద్ధంతో ఆ దేశానికి సంబంధం లేకున్నా ఇక్క‌డ రేట్లు పెంచేశారు.

స‌న్‌ఫ్ల‌వ‌ర్ నూనె రేట్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెంచుతున్నారు. రూ.160-180 మ‌ధ్య లీట‌రు ప‌లుకుతోంది. అక్క‌డ నుంచి దిగుమ‌తులు ఆగిపోయే ప‌రిస్థితులు ఉంటే రేట్లు పెంచినా అర్థం ఉంటుందుగానీ, ఇప్పుడు ఇంపోర్ట్ అయిన స‌ర‌కుపై పెంచ‌డం ఏమిటన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

నూనె రేట్లు అదుపులో లేక‌పోతే టిఫిన్స్‌, స్నాక్స్ ధ‌ర‌లు పెంచే ప‌రిస్థితి వ‌స్తుందేమోన‌ని హోట‌ళ్లు, తోపుడు బండ్ల‌వారు అంటున్నారు. నూనె ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటికి ఆ సెగ తగులుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh connection
  • russia
  • Russia-Ukraine War
  • sun flower oil
  • ukraine
  • vijayawada

Related News

Russia

ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

కువైట్‌లో జరిగిన ఇరాన్ దాడిలో 6 మంది అమెరికా సైనికులు మరణించగా, మరికొందరు గాయపడటం గమనార్హం.

  • Asus Opening

    ASUS : విజయవాడలో ఆసుస్ (ASUS) తన సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ ప్రారంభం

Latest News

  • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd