New National Highway : ఏపీకి మరో కొత్త నేషనల్ హైవే
New National Highway : ఈ కోస్టల్ హైవే కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వీకరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం బాగా మెరుగవుతుంది.
- By Sudheer Published Date - 01:00 PM, Sat - 12 July 25

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రధాన రహదారి (New National Highway) వరంగా రానుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు (Moolapet Port) నుంచి భీమిలి వరకు కొత్త నేషనల్ హైవే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కోస్టల్ హైవే కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వీకరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం బాగా మెరుగవుతుంది.
Rappa Rappa : ‘చీకట్లో మొత్తం అయిపోవాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని
ఈ హైవేను ఆరు లేన్లుగా, సుమారు 200 కిలోమీటర్ల మేర నిర్మించేలా ప్రణాళికలు పొందించబడుతున్నాయి. ఈ రహదారి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య తేలికైన ప్రయాణాన్ని అందిస్తుంది. తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధికి ఇది దోహదపడనుంది. ప్రధానంగా పోర్ట్‌కు చేరుకునే రవాణా మార్గాల అభివృద్ధి ద్వారా దిగుమతి–ఎగుమతులలో వేగం పెరగనుంది.
ప్రాజెక్టు చేపట్టే దశలో ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) రూపొందించే ప్రక్రియ ప్రారంభమవనుంది. ఇది పూర్తయిన వెంటనే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా కేంద్రం నుండి వచ్చిన ఈ సమాధానం వలన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.