CBN : చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు.. ఏ1గా మాజీ మంత్రి పీతల, ఏ2గా చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం వరుస కేసుల నమోదు చేస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర
- Author : Prasad
Date : 02-11-2023 - 6:24 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం వరుస కేసుల నమోదు చేస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది.ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని, ఏ4గా దేవినేని ఉమని చేర్చారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదులో ఉంది. ఇటీవల మద్యం కంపెనీల అనుమతులపై కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. వరుస కేసులతో చంద్రబాబుని మళ్లీ జైల్లో పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు వారాల పాటు చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28న సాయంత్రం 5గంటలకు రాజమండ్రి జైల్లో సరెండర్ కావాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతంది. నవంబర్ 8న క్వాష్ పిటిషన్‌పై తీర్పుపై టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నారు. క్వాష్ పిటిషన్ బాబుకు అనుకూలంగా వస్తే మిగిలిన కేసులపై ఆ ప్రభావం ఉండబోతుందని చంద్రబాబు తరుపు లాయర్లు వాదిస్తున్నారు.
Also Read: TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి కనిపించదా..?