HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Annadata Sukhibhav And Thalli Kivandanam Schemes To Be Launched Next Month Cm Chandrababu

CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు

గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం.

  • Author : Latha Suma Date : 30-04-2025 - 6:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP Government
TDP Government

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్‌స్థాయి నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తాం. అభివృద్ధి అమరావతికే పరిమితం కాదు.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు అన్నారు.

Read Also: New CS Ramakrishna Rao : సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు

మే 2న జరగనున్న అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మే 2న అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీ వస్తున్నారు. రూ.49,040 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. వీటితో పాటు వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్రంలో డీఆర్‌డీవో, డీపీఐపీ, నాయ్‌, రైల్వే ప్రాజెక్టులకు మరో రూ.57,962 కోట్ల మేర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ప్రజలు, యువత ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నిర్మాణం ఉంటుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు. వచ్చే మూడేళ్లలో అమరావతిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం అన్నారు.

అమరావతి పనుల పునఃప్రారంభ పనులతో పాటు వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్రంలో డీఆర్‌డీవో, డీపీఐపీ, నాయ్‌, రైల్వే ప్రాజెక్టులకు మరో రూ.57,962 కోట్ల మేర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. విశాఖలో టీసీఎస్‌ రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా నిర్మిస్తున్నాం. శ్రీసిటీలో ఎల్జీ కంపెనీ రూ.5వేల కోట్లు పెట్టబడులు పెట్టనుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి అని చంద్రబాబు నేతలకు తెలిపారు. అంతేకాక.. క్యాడర్‌ని నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మూడు పార్టీల నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడే కార్యకర్తలను గుర్తించేందుకు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసుకున్నామన్నారు.

మహానాడు కడపలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా ఎన్డీయే గెలవాలని నేతలకు సూచించారు.కాగా, సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోవడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని కేవలం ఈ ఘటనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు నేతలతో అన్నారు. ఘటనా స్థలానికి వెళ్దామనుకుంటే.. భక్తుల దర్శనాలకు అంతరాయం ఏర్పడుతుందనే అమరావతి నుంచి సమీక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Bangladesh : ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌కు బెయిల్‌..!

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati work resumes
  • Annadata Sukhibhava
  • CM Chandrababu
  • pm modi
  • Talliki Vandanam Scheme

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd