Mark Shankar : కొడుకు కోసం అన్నా లెజినోవా ఏంచేసిందో తెలుసా..?
Mark Shankar : తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం విశేషం. ఇది తల్లి హృదయాన్ని ప్రతిబింబించే చర్యగా పలువురు భక్తులు అభినందించారు
- By Sudheer Published Date - 09:24 PM, Sun - 13 April 25

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య (Pawan Wife) అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకునేందుకు ఆదివారం తిరుమల చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) క్షేమంగా బయటపడటంతో, శ్రీవారికి మొక్కుబడిని తీర్చేందుకు తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం విశేషం. ఇది తల్లి హృదయాన్ని ప్రతిబింబించే చర్యగా పలువురు భక్తులు అభినందించారు. తలనీలాలు సమర్పించిన అనంతరం.. ఆమె కొంతసేపు ఆలయ పరిసరాల్లో మౌనంగా ప్రార్థనలు చేశారు. కుమారుడు ప్రమాదం నుంచి బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
Devakatta : రాజమౌళి – మహేష్ చిత్రానికి దేవాకట్టా మాట సాయం
ఆమె రేపు ఉదయం శ్రీవారి ప్రత్యేక దర్శనం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అన్నా లెజినోవా కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. టిటిడి అధికారులు ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముందుగా ఏర్పాట్లు చేసారు. వీఐపీ కోటాలో దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇటీవల సింగపూర్‌లో ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అక్కడే ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడటం అందరికీ ఊరట కలిగించింది. వెంటనే అతడిని సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
తన రాజకీయ, సినీ కార్యక్రమాల వల్ల పవన్ స్వయంగా తిరుమల రావడానికి వీలు కాకపోయినా, అన్నా లెజినోవా మొక్కుబడి తీర్చడానికి స్వయంగా ఆలయానికి చేరుకున్నారు. ఈ ఘటన భక్తుల మధ్య ఆసక్తికర చర్చకు దారి తీసింది. పవన్ కుటుంబం భగవంతుని మీద చూపిన భక్తిని చూస్తూ, భక్తులూ శ్రద్ధతో ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.
అనా గారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.🙏🏼#AnnaLezhneva #PawanKalyan pic.twitter.com/bJzDddmJT4
— Team PSPK (@_TeamPSPK) April 13, 2025